విజయనగరం జిల్లా : మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తమ సర్కార్ పై చేసిన కామెంట్స్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఏడాదిన్నర పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదన్న బొత్స వ్యాఖ్యలు పూర్తిగా హాస్యాస్పదం అన్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన వైసీపీకి విమర్శించే నైతిక హక్కు లేదన్నారు . కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రైతులకు ఏమీ చేయలేదంటూ ఆరోపించే ముందు వైసీపీ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు నిలిచిపోయాయో బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ప్రజలు పండుగలకే భయపడే పరిస్థితి ఉండేదన్నారు. నాడు, నేడు తేడా ఏంటో ప్రజలకు తెలుసు అన్నారు.
మద్యం ధరలపై మాట్లాడే హక్కు బొత్సకు లేదని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వమే అధిక పన్నులతో ప్రజలను దోచుకుందని ఆరోపించారు కొండపల్లి శ్రీనివాస్ . జూదం, కోడిపందాలకు వైసీపీ హయాంలోనే రాజకీయ రక్షణ లభించిందన్నారు. వైసీపీ పాలనలో దేవాలయాలపై దాడులు, హిందూ పండుగలపై ఆంక్షలు జరిగాయన్నారు. సంప్రదాయాలపై దాడి చేసింది వైసీపీనే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలపై వైసీపీ విమర్శలు హాస్యాస్పదం అన్నారు. వారి హయాంలోనే హత్యలు, దాడులు, అరాచకాలు విపరీతంగా జరిగాయని ధ్వజమెత్తారు. కొనుగోలు శక్తి తగ్గడానికి కారణం వైసీపీ ఐదేళ్ల అవినీతి, అప్పుల పాలన అని ఆరోపించారు.
