Elon Musk : అమెరికా : ప్రపంచ కుబేరుల జాబితాలో టెస్లా కార్ల కంపెనీ వ్యవస్థాపకుడు , చైర్మన్, ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ సిఈఓ ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలనంగా మారారు. ఆయన ఎల్లప్పుడూ ఏదో ఒక నిర్ణయంతో ముందు వరుసలో ఉండేందుకు ప్రయత్నం చేశాడు. తాజాగా కీలక ప్రకటన చేశాడు. వికీపీడియా స్థానంలో గ్రోక్ పీడియా తీసుకు వస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా తమ కంపెనీకి సంబంధించి కీలకమైన బోర్డు మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ప్రధానంగా ఎలాన్ మస్క్ తీసుకునే భారీ వేతనం గురించే చర్చంతా. ఒక ట్రిలియన్ డాలర్ల జీతం ప్యాకేజీపై సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు టాక్. టెస్లా వాటాదారులు ప్రధానంగా ప్రస్తావించారు.
Elon Musk Sensational
ప్రధానంగా ఎస్ఓసీ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ , టెస్లా వాటాదారుల టీం సీఈఓ ఎలాన్ మస్క్ ప్రతిపాదిత ఒన్ ట్రిలియన్ డాలర్ల పరిహారంతో కూడిన ప్యాకేజీపై ఆందోళన వ్యక్తం చేయడం చర్చకు దారి తీసేలా చేసింది. ఇతర పెట్టుబడిదారులను ఈ ప్రణాళికను తిరస్కరించాలని కోరారు. కాగా గత సెప్టెంబర్ నెలలో అమెరికన్ ఈవీ సంస్థ సంచలన ప్రకటన చేసింది. మస్క్ భారీ వేతనం పొందనున్నాడని ప్రకటించింది. అయితే దీనికి ఓ కండీషన్ కూడా ఉంది. మస్క్ టెస్లా విలువను ఎనిమిది రెట్లు పెంచితే, ఒక మిలియన్ ఏఐ రోబోట్‌లను విక్రయిస్తే, మరో 12 మిలియన్ టెస్లా కార్లను డెలివరీ చేయడంతో పాటు ఇతర నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటేనే ఈ భారీ ప్యాకేజీకి అర్హుడవుతాడని పేర్కొంది.
Also Read : Sonam Wangchuk Shocking : సుప్రీంకోర్టును ఆశ్రయించిన వాంగ్ చుక్ భార్య
















