హైదరాబాద్ : హైదరాబాద్ నగరానికి మరో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ రానుంది. దావోస్ నగరంలో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు లో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. ఈ సందర్బంగా ప్రముఖ సంస్థ బ్లేజ్ తో అవగాహన ఒప్పందం చేసుకున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో బ్లేజ్ సంస్థ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఏఐ ఇనిషియేట్స్ కోసం ఆర్ అండ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
‘తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం కంపెనీ సహ వ్యవస్థాపకుడిని కలిసింది. ఆర్ అండ్ డి సెంటర్‌ను స్కేలింగ్ చేయడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చింది. అంతే కాకుండా స్మార్ట్ సిటీలు, పరిశ్రమ పరిష్కారాలపై దృష్టి సారించనుంది. అంతే కాకుండా ఆసియా అంతటా హైబ్రిడ్ ఏఐ మౌలిక సదుపాయాల కోసం బ్లేజ్ భాగస్వాములను కలిగి ఉంటుందని ప్రకటించింది. ఏఐ కంప్యూటింగ్ కోసం శక్తి-సమర్థవంతమైన ఏఐ హార్డ్‌వేర్, పూర్తి-స్టాక్ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే కాలిఫోర్నియాకు చెందిన కంపెనీ బ్లేజ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దావోస్ లో జరిగిన ఈ ఒప్పందం కార్యక్రమంలో బ్లేజ్ సహ వ్యవస్థాపకుడు , సీఈవో దినకర్ మొనగాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
















