హైదరాబాద్ : తాను వేసుకున్న దుస్తుల కారణంగానే తనపై దాడి జరిగిందంటూ టాలీవుడ్ కు చెందిన నటుడు శివాజీ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. అన్ని వర్గాల నుండి తను విమర్శలు ఎదుర్కొన్నారు. ఆపై బహిరంగంగా తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనంటూ పేర్కొన్నారు. చివరకు మహిళా కమిషన్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలు నిండుగా చీరలు ధరిస్తేనే అందంగా ఉంటుందని, తమ అందాలను కనిపించేలా చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు నటుడు శివాజీ. దీనిపై ముందుగా ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. శవాజీ హద్దులు మీరి దాటి మాట్లాడటం భావ్యం కాదన్నారు. వెంటనే క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని పేర్కొన్నారు.
ఇదే సమయంలో మరో నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సీరియస్ అయ్యారు శివాజీ వెంటనే సారీ చెప్పాలన్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పేనని చెప్పారు. బేషరతుగా తను వివరణ ఇవ్వాలని, ఇక నుంచి ఇలాంటి జుగుస్సాకర, కించపరిచే వ్యాక్యలు చేయబోనంటూ చెప్పాలన్నారు. ఎవరి శరీరం వారిదని, వారికి నచ్చినట్టు వారు ఉంటారని, నచ్చినట్టు దుస్తులు వేసుకుంటారని పేర్కొన్నారు అనసూయ భరద్వాజ్. చివరకు హైదరాబాద్ లోని లులూ మాల్ లో జరిగిన కార్యక్రమంలో తనపై దాడి చేశారు ఫ్యాన్స్. తాను పొట్టి దుస్తులు ధరించడం వల్లనే ఇలా జరిగిందంటూ శివాజీ కామెంట్స్ చేయడాన్ని ఫైర్ అయ్యారు. బాధితురాలినైన తనకు అండగా ఉండాల్సింది పోయి బాధ పెడితే ఎలా అని ప్రశ్నించింది నిధి అగర్వాల్.



















