BJP Shocking Azharuddin : అజారుద్దీన్ పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం కోడ్ ఉల్లంఘ‌నే

Hello Telugu - BJP Shocking Azharuddin

Hello Telugu - BJP Shocking Azharuddin

BJP : హైద‌రాబాద్ : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ స్కిప్ప‌ర్ మ‌హ‌మ్మ‌ద్ అజారుద్దీన్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజ‌ధాని హైద‌రాబాద్ లోని జూబ్లీహిల్స్ శాస‌న స‌భ‌కు ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ ప్ర‌ధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ (BJP), బీఆర్ఎస్ బ‌రిలో ఉన్నాయి. ప్ర‌ధాన పోటీ కాంగ్రెస్ వ‌ర్సెస్ బీఆర్ఎస్ గా మారింది. ఈ త‌రుణంలో ఇక్క‌డ పోటీ చేయాల‌ని చివ‌రి దాకా ప్ర‌య‌త్నం చేశారు అజారుద్దీన్. దీంతో హైక‌మాండ్ త‌న‌కు ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇస్తాన‌ని ప్ర‌క‌టించింది. గ‌వ‌ర్న‌ర్ కోటా కింద త‌న‌కు కేటాయిస్తున్న‌ట్లు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు సీఎం. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఏఐసీసీ హైక‌మాండ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌స్తుత రాష్ట్ర మంత్రివ‌ర్గంలో అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తున్న‌ట్లు పేర్కొంది. దీనిని అధికారికంగా ప్ర‌క‌టించింది టీపీసీసీ.

BJP Shocking Azharuddin

ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న మంత్రివ‌ర్గంలో మైనార్టీల‌కు ఛాన్స్ ఇవ్వ‌క పోవ‌డం ఇబ్బందిగా మారింది అధికార కాంగ్రెస్ పార్టీకి. ప్ర‌స్తుతం జ‌ర‌గ‌బోయే జూబ్లీ హిల్స్ బై పోల్ లో మైనార్టీల ఓటు బ్యాంకు ఎక్కువ‌గా ఉంది. వారిని ప్ర‌స‌న్నం చేసుకోవ‌డంలో భాగంగానే అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇస్తున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. దీనిపై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేసింది భార‌తీయ జ‌నతా పార్టీకి చెందిన ఎంపీ డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి. ఆమెతో పాటు ఎమ్మెల్యే పాయ‌ల్ శంక‌ర్ , సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డి లు గురువారం రాష్ట్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిశారు. అజారుద్దీన్ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డం కోడ్ ఉల్లంఘ‌న కింద‌కు వ‌స్తుంద‌ని ఆరోపించారు.

Also Read : Minister Komatireddy Clear Instructions : ప్ర‌జా రవాణాకు ఆటంకాలు లేకుండా చూడాలి

Exit mobile version