Bigg Boss : తెలుగు బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతోంది బిగ్ బాస్ రియాల్టీ షో. ఈసారి హోస్ట్ నాగార్జున మారుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎందుకనో మరోసారి నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. ఈ సీజన్ కు కూడా మన్మథుడే నిర్వహిస్తారని అధికారికంగా వెల్లడించారు. దీంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇదిలా ఉండగా కీలక అప్ డేట్ వచ్చింది . అదేమిటంటే సెప్టెంబర్ 7వ తేదీన అధికారికంగా టెలికాస్ట్ అవుతుందని తెలిపారు. కాగా ప్రేక్షకులను ఆకర్షించడానికి షో నిర్మాతలు ఏ ఒక్క ఛాన్స్ ను వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి ప్రకటించినా మరికొందరు కూడా జాయిన్ అవుతారని సమాచారం. ప్రస్తుతం బిగ్ బాస్ (Bigg Boss) ప్రోగ్రాంకు సంబంధించి కొత్త పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎక్కువగా ఒకరి పేరు వినిపిస్తోంది రీతూ చౌదరి పాల్గొంటారని టాక్.
Bigg Boss Show Updates
ఆమె ప్రముఖ ఇన్‌ఫ్లుయెన్సర్ గా పేరు పొందింది. అంతే కాకుండా యువతలో భారీ ఫాలోయింగ్ కలిగి ఉంది. ఆమె చేరిక ఆసక్తికరంగా ఉంది. రీతు ఉనికి ఖచ్చితంగా షోకు మరింత మెరుపును జోడిస్తుందని భావిస్తున్నారు నిర్వాహకులు. కాగా ఈ షోను మరింత జనరంజకంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఒక్క షో ద్వారా భారీ జనాదరణ పొందుతున్నారు ఇందులో పాల్గొన్న వారు. ప్రచారంతో పాటు సినీ రంగంలో పెద్ద ఎత్తున ఆఫర్లు తలుపు తడుతున్నాయి. ఈ షో కోసం వేలాదిమంది అభిమానులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
Also Read : Beauty Anushka Shetty – Prabhas : డార్లింగ్ తో నటించేందుకు ఎదురు చూస్తున్నా


















