Bigg Boss 9 Sensational : బిగ్ బాస్ -9 గ్రాండ్ లాంచ్..కంటెస్టెంట్స్ వీళ్లే

గ‌తంలో కంటే భిన్నంగా నాగార్జున హ‌ల్ చ‌ల్

Hello Telugu - Bigg Boss 9 Sensational

Hello Telugu - Bigg Boss 9 Sensational

Bigg Boss 9 : హైద‌రాబాద్ : ఎంతో ఉత్కంఠ రేపిన బిగ్ బాస్ షో ఎట్ట‌కేల‌కు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. మ‌రోసారి త‌న స‌త్తా ఏమిటో చూపించారు హోస్ట్ , ప్ర‌ముఖ న‌టుడు అక్కినేని నాగార్జున‌. ఆయ‌న కాకుండా ఈసారి వేరే వారిని హోస్ట్ గా తీసుకు రావాల‌ని స్టార్ మా నిర్వాహ‌కులు ప్ర‌య‌త్నం చేశారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. సెల‌బ్రిటీలతో పాటు సామాన్యులు కూడా ఈసారి బిగ్ బాస్ 9లో (Bigg Boss 9) పార్టిసిపేట్ చేస్తున్నారు. అంగ‌రంగ వైభ‌వంగా షో ప్రారంభ‌మైంది. మొత్తం 15 మంది పోటీదారుల‌తో స్టార్ట్ చేశారు నాగ్. వీరిలో ఆరుగురు స‌భ్యులు బిగ్ బాస్ అగ్ని ప‌రీక్ష నుండి ఎంపిక చేసిన వారున్నారు. ఈసారి నిర్వాహ‌కులు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. సెలిబ్రిటీల‌కు కాకుండా ఇత‌రుల‌కు కూడా ఛాన్స్ ఇవ్వాల‌ని నిర్ణ‌యించారు.

Bigg Boss 9 New Contestents

ఇందుకు గాను వ‌డ‌పోత పోగా 45 మంది స‌భ్యుల‌ను షార్ట్ లిస్ట్ చేశారు. వారిలో చివ‌ర‌కు 15 మందిని ఎంపిక చేశారు. ఇందులో ముగ్గురు పోటీదారులను ఓటింగ్ ద్వారా ఎంపిక చేయగా, మరో ముగ్గురిని శ్రీముఖి, బిందు మాధవి, నవదీప్ ఎంపిక చేశారు. ఈసారి సెలబ్రిటీలు, సామాన్యుల మిశ్రమం చాలా ఆసక్తిని రేపేలా చేసింది. ఈసారి టైటిల్ కోసం ప్ర‌ముఖుల‌తో పాటు సామాన్యులు కూడా పోటీ ప‌డుతుండ‌డం విశేషం. ఇక కంటెస్టెంట్స్ ప‌రంగా చూస్తే వివ‌రాలు ఇలా ఉన్నాయి. స్ర‌వంతి టీవీ సీరియ‌ల్ న‌టించిన భ‌ర‌ణి, శ్రేష్టి వ‌ర్మ‌, న‌టిమ‌ణులు ఆశా షైనీ, సంజ‌నా గ‌ర్లాని, న‌టుడు సుమ‌న్ శెట్టి, యూట్యూబ్ ఫేమ్ రీతూ చౌద‌రి, టీవీ సీరియ‌ల్ న‌టి ముద్ద మందారం, జాన‌ప‌ద గాయ‌కుడు రాము రాథోడ్, మ‌ర్యాద మ‌నీష్ , డాక్ట‌ర్ ప్రియా శెట్టి, శ్రీ‌జ ద‌మ్ము, హ‌రీష్ , ప‌వ‌న్ ఉన్నారు.

Also Read : Vizag Heavy Rains – Huge Loss : విశాఖ‌ను ముంచెత్తిన వాన‌..పిడుగుల‌ దెబ్బ

Exit mobile version