Bigg Boss 9 : హైదరాబాద్ : అందరూ ఊహించని దానికంటే భిన్నంగా ఈసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది అక్కినేని నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న బిగ్ బాస్ -9 (Bigg Boss 9) షో. గతంలో కంటే ఈసారి సామాన్యులతో పాటు సెలిబ్రిటీలను ఎంపిక చేశారు. ఈనెల 7వ తేదీన గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి మరో యుద్దానికి సిద్దం అనే క్యాప్షన్ తో ప్రారంభించడం విశేషం. మొత్తం 15 మందిని చివరగా ఎంపిక చేశారు. హౌస్, థీమ్ , సరికొత్త పోటీదారుల లైనప్‌ను పరిచయం చేసింది ఈ షో. కొత్త ముఖాలు, తిరిగి వచ్చే సెలబ్రిటీలు ఈ సీజన్‌లో మేకర్స్ వాగ్దానం చేసిన ఉత్తేజకరమైన మలుపుల గురించి వీక్షకులు ఆసక్తితో సందడి చేస్తున్నారు.
Bigg Boss 9 Remunerations Update
వినోదానికంటే ఎక్కువగా ఆదరణ చూరగొంది బిగ్ బాస్ షో. కీర్తితో పాటు అద్భుత విజయాన్ని అందిస్తుండడంతో కాసుల పంట పండుతోంది ఇందులో పాల్గొన్న వారికి. విచిత్రం ఏమిటంటే జనానికి తెలియని వారంతా ఒకే ఒక్క షో కారణంగా టాప్ లోకి వచ్చేస్తున్నారు. సెలిబ్రిటీలుగా మారి పోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ పాలమూరు జిల్లాకు చెందిన రాము రాథోడ్ ఆడి పాడిన రాను ముంబైకి రాను 500 మిలియన్లను మించి పోయింది ..యూట్యూబ్, సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ బిగ్ బాస్ షోలో తను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారాడు.
ఇక విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇందులో పాల్గొనే సామాన్యులకు రోజుకు రూ. 13 వేల నుంండి రూ. 20 వేల వరకు, ప్రజాదరణ పొందిన వారికి రోజుకు రూ. 20 వేల నుండి రూ. 25 వేల వరకు, బాగా గుర్తింపు పొందిన వారికి రోజుకు రూ. 30 వేలు, అధిక డిమాండ్ ఉన్న వారికి రోజుకు రూ. 40 వేలు పారితోషకంగా ఇస్తున్నట్టు టాక్. ఇందులో పాల్గొనే సామాన్యులకు మొత్తంగా రూ. 20 లక్షల దాకా ఉంటే ప్రముఖులకు రూ. 40 లక్షల నుంచి రూ. 50 లక్షల దాకా ఉండే ఛాన్స్ ఉంది.
Also Read : KTR Shocking Comments : కవిత సస్పెన్షన్ పై కేటీఆర్ కామెంట్స్



















