Ambati Rambabu : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఆయనపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. గత వైసీపీ ఐదేళ్ల పరిపాలనా కాలంలో కేబినెట్ లో కీలక పాత్ర పోషించిన రాంబాబు (Ambati Rambabu) అనేక అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు తమకు ఫిర్యాదులు వచ్చాయని ఈ సందర్భంగా ప్రభుత్వం వెల్లడించింది. జగనన్న కాలనీల కోసం భూములను ఎకరం రూ.10 లక్షలకు కొని ప్రభుత్వానికి రూ.30 లక్షలకు అమ్మినట్లు గుర్తించినట్లు స్పష్టం చేసింది.
A Big Shock for Ex Minister Ambati Rambabu
విద్యుత్ కేంద్రాల్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టు రూ.7 లక్షల చొప్పున అమ్ముకున్నాడని, అంతులేని డబ్బులను సంపాదించారంటూ పేర్కొంది ప్రభుత్వం. ఈ సందర్బంగా అంబటి అవినీతి ఆరోపణలపై విచారణ చేసి నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా విజిలెన్స్ నివేదికలో అక్రమాలు తేలితే కేసును ఏసీబీకి ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు.
ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. కూటమి సర్కార్ , సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అన్నింటిని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నానని ప్రకటించారు అంబటి రాంబాబు.
Also Read : PVN Madhav Interesting Comments : చర్చల ద్వారానే సమస్యలకు పరిష్కారం

















