Bhumi Sunil : హైదరాబాద్ : ప్రఖ్యాత భూమి హక్కుల సంస్కర్త, న్యాయ నిపుణులు, రైతు న్యాయవాది ఎం.సునీల్ (Bhumi Sunil) కుమార్ (భూమి సునీల్)కు భూమి రత్న పురస్కారం లభించింది. రైతుల భూమి హక్కులు, గ్రామీణ ప్రాంతాల్లో న్యాయ సాధికారతకు గాను ఆయన అందించే విస్తృత సేవలకు ఈ గౌరవం దక్కింది . ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన రైతు నేస్తం, ముప్పవరపు ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు భూమి రత్న పురస్కారాన్ని అందించారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయం నుండి పట్టభద్రుడైన సునీల్ కుమార్ గత ఇరవై ఏళ్లుగా భూ సంస్కరణలు, గ్రామీణ చట్ట పరమైన సాధికారత, వ్యవసాయ చట్టాలు, విధానాల రూప కల్పనలో విశేష సేవలందిస్తూ వస్తున్నారు.
Bhumi Sunil Gets
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ( సెర్ప్) రాష్ట్ర లీగల్ కో-ఆర్డినేటర్‌గా పని చేశారు. ఆయన నేతృత్వంలో అమలు చేసిన కమ్యూనిటీ పారా లీగల్ ప్రోగ్రాం ద్వారా 10 లక్షలకు పైగా గ్రామీణ కుటుంబాలు తమ భూములపై హక్కులు పొందగలిగాయి. రూరల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ (ఆర్డీఐ) డైరెక్టర్ గా పని చేసినప్పుడు రైతులకు న్యాయ అవగాహన పెంపొందించడం, భూమి పరిపాలనా వ్యవస్థల బలోపేతం చేయడం, భూసంస్కరణ విధానాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు.
నీతి ఆయోగ్ ల్యాండ్ లీజింగ్ నిపుణుల కమిటీ, భారత ప్రభుత్వ ల్యాండ్ టాస్క్ ఫోర్స్, పలు రాష్ట్ర స్థాయి భూసంస్కరణ కమిటీలలో సభ్యుడిగా కూడా సునీల్‌కుమార్ సేవలందించారు.తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధరణి కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. భూ పరిపాలన మెరుగుదలకు ఆయన చేసిన సూచనలు, అలాగే భూభారతి చట్టం రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యయసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడిగా ఉన్నారు.
Also Read : Minister Kandula Durgesh Interesting Update : క్రీడలతో ఆరోగ్యం వ్యక్తిత్వ వికాసం

















