Bhumana Sensational Comments : చంద్ర‌బాబు మేనిఫెస్టో బ‌క్వాస్ – భూమ‌న‌

నిప్పులు చెరిగిన మాజీ మంత్రి ఆర్కే రోజా

hellotelugu-bhumanarkroja

Bhumana : చిత్తూరు జిల్లా – ఎన్నిక‌ల సంద‌ర్బంగా నారా చంద్ర‌బాబు నాయుడు ప్ర‌క‌టించిన మేనిఫెస్టో ఏమైందంటూ ప్ర‌శ్నించారు టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి (Bhumana). ఆరు గ్యారెంటీల పేరుతో ప్ర‌జ‌ల‌ను నిట్ట నిలువునా మోసం చేశారంటూ ధ్వ‌జ‌మెత్తారు. వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త కూట‌మి స‌ర్కార్ కే ద‌క్కుతుంద‌న్నారు. సోమ‌వారం చిత్తూరు జిల్లా న‌గ‌రిలో పెద్ద ఎత్తున వైసీపీ ఆధ్వ‌ర్యంలో బాబు మేనిఫెస్టో ఏమైందంటూ ప్ర‌శ్నిస్తూ పెద్ద ఎత్తున ఆందోళ‌న చేప‌ట్టారు. పెద్ద ఎత్తున నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పాల్గొన్నారు.
ఆచ‌ర‌ణ‌కు హామీలు ఇచ్చింది కాక జ‌నం నెత్తిన మ‌రింత భారం మోపేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Bhumana Karunakar Reddy Sensational Comments on CM Chandrababu

ఈ కార్య‌క్ర‌మానికి అధ్య‌క్ష‌త వ‌హించిన మాజీ మంత్రి ఆర్కే రోజా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇచ్చిన హామీల‌న్నీ మోస పూరిత‌మేన‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు తిర‌గ‌బడే రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు. కేవ‌లం క‌క్ష సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డ‌డం త‌ప్పితే ఏపీలో కూట‌మి స‌ర్కార్ చేసింది ఏముందంటూ ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేకించి వైఎస్సార్సీపీ నాయ‌కులు, మాజీ మంత్రులు, ప్ర‌జా ప్ర‌తినిధులు, కార్య‌క‌ర్త‌లు, శ్రేణులను టార్గెట్ చేస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమ‌లు చేస్తున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు ఆర్కే రోజా సెల్వ‌మ‌ణి. మోసం చంద్ర‌బాబు నైజ‌మ‌ని, ఆయ‌న గురించి తెలిసిన వారంతా ఇదే మాట అంటూరంటూ పేర్కొన్నారు.

Also Read : Falcon App Scam : ఫాల్క‌న్ యాప్ స్కామ్ లో రూ. 4,215 కోట్ల మోసం

Exit mobile version