Bhatti Vikramarka : హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాల పంపిణీను ఒకేసారి నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని సమగ్రంగా, శ్రద్ధగా నిర్వహించినట్లు తెలిపారు, మండల సమాఖ్య–గ్రామ సమాఖ్యల ముఖ్యులు తప్పనిసరిగా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు భట్టి విక్రమార్క. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన వడ్డీ లేని రుణాల పథకాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తమ ప్రజా ప్రభుత్వం పునరుద్ధరించడం జరిగిందని చెప్పారు.
DY CM Bhatti Vikramarka Huge Funds Released
దీని కారణంగా రాష్ట్ర మహిళల్లో నమ్మకం, ధైర్యం మరింత పెరిగాయని అన్నారు మల్లు భట్టి విక్రమార్క. ఇప్పటికే పలుమార్లు రుణాలు పంపిణీ చేశామన్నారు, ఈ 25న మరలా పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు రుణాలు అందించేందుకు శ్రీకారం చుట్టడం జరగిందని చెప్పారు. ఇదిలా ఉండగా దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా సంఘాలకు ప్రత్యేకంగా స్థిర ఆదాయం వచ్చేలా రుణాలు ఇచ్చామన్నారు. ఏకంగా ఆర్టీసీ సంస్థతో ఒప్పందం చేసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు తొలి విడతగా 151 బస్సులు ఇచ్చామన్నారు డిప్యూటీ సీఎం. ప్రతి నెలా ఆర్టీసీ రూ. 69 వేలకు పైగా అద్దె ఇస్తుందన్నారు. రెండో విడతలో మరికొన్ని బస్సులు ఇస్తామన్నారు.
Also Read : Pawan Kalyan Interesting Update : మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్
