హైదరాబాద్ : కిషోర్ తుమ్మల దర్శకత్వం వహించిన చిత్రం భర్త మహాశయులకు విజ్ఞప్తి . సినిమా షూటింగ్ పూర్తయింది. సినిమాకు సంబంధించిన ట్రైలర్, గ్లింప్స్ , పాటలు కూడా విడుదలయ్యాయి. ఇందులో ఇద్దరు లవ్లీ హీరోయిన్స్ నటించడం విశేషం. కీలకమైన రోల్ పోషించాడు నటుడు రవితేజ. తనతో పాటు అందాల ముద్దుగుమ్మలు ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి, సునీల్ , సత్య, వెన్నెల కిషోర్ , సుధాకర్, మురళీధర్ గౌడ్ , తదితరులు నటించారు. ఈ సినిమాను పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు కిషోర్ తిరుమల. కథ, స్క్రీన్ ప్లే , దర్శకత్వం కూడా తనే కావడం విశేషం. గతంలో కూడా పూర్తిగా కథకు తోడు కామెడీ, వినోదాన్ని పండించేలా సినిమాలు తీశాడు.
ఇక ఇంటిల్లిపాది హాయిగా నవ్వుకునేలా, 2 గంటల పాటు సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేసేలా తన సినిమాలు ఉండేలా జాగ్రత్త పడతాడు దర్శకుడు కిషోర్ తిరుమల. టాలీవుడ్ లో ఇప్పుడు భీమ్స్ హవా కొనసాగుతోంది. తను గతంలో రవితేజ ధమాకా మూవీకి కూడా అద్భుతమైన సంగీతం అందించాడు. ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం మూవీకి చేశాడు. ప్రస్తుతం సంక్రాంతికి రాబోయే చిరంజీవి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ చిత్రానికి కూడా తనే సంగీతం ఇచ్చాడు. తాజాగా రవితేజ మూవీ భర్త మహాశయులకు కూడా తానే మ్యూజిక్ ఇవ్వడం విశేషం. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ , సాంగ్స్ కు మంచి ఆదరణ లభించింది. ఇదిలా ఉండగా మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. జనవరి 13న వరల్డ్ వైడ్ గా భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ రానుందని ప్రకటించారు.
https://www.youtube.com/watch?v=1-aMkdeFFew
