చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా మృతి చెందడం పట్ల కన్నీటి పర్యంతం అయ్యాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా. తాను తన సోదరులతో కలిసి ఓ టీంగా ఏర్పడ్డారు తొలి నాళ్లలో. ఆ తర్వాత భారతీరాజా రచయితగా, దర్శకుడిగా మారారు. ఎస్బీ బాలసుబ్రమణ్యం వద్ద కచేరీలో ఇళయరాజా తో పాటు సోదరులకు కూడా అవకాశం కల్పించాడు. తనకు 84 ఏళ్లు. తను చరిత్ర సృష్టించాడు. తనదైన ముద్ర కనబర్చారు. తన సోదరుడు, సహచరుడు, తన శరీరంలో భాగంగా ఉన్నాడని ఇంతకంటే ఇంకేం మాట్లాడలేని స్థితిలో ఉన్నానని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు ఇళయరాజా.
ఈ సందర్బంగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చేందుకు దాట వేశారు . “మీ సన్నిహిత మిత్రుడు కన్నుమూశారు… దీనిపై మీరేమంటారు?” అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. మిత్రుడు అంటే ఎవరు..నాకైతే అందరూ మిత్రులే. అభిమానులు, కళాకారులు అందరినీ నేను ప్రేమిస్తాను… భారతీరాజాకు నా సంతాపం. ఇంతకంటే ఏం మాట్లాడలేననంటూ పేర్కొన్నాడు.
పైకి చూస్తే ఇది అహంకారంగా అనిపించవచ్చు… కానీ ఈ సంగీత మహర్షి ఎప్పుడో లౌకిక బంధాలకు అతీతంగా నిలిచారు. ఆయన పవిత్ర మరణాన్ని కూడా కేవలం ఒక సంఘటనగానే చూశారు. కానీ మనోజ్ మరణం, కొడుకును కోల్పోయిన బాధను భారతీరాజా తట్టుకోలేక పోయారు. తీరని వేదనతో ఆయన కుమిలి పోయారు. అటువంటి బంధాలకు అతీతమైన ఆ మహర్షి మాత్రం కచేరీలు చేస్తూ, పర్యటనలు సాగిస్తూనే ఉండడం విశేషం.
