Belly Fat : బరువు తగ్గాలని, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకునే కొవ్వును తగ్గించాలని (Belly Fat) కోరుకునే వారికి పలు ఫలాలు సహజమైన పరిష్కారంగా నిలుస్తున్నాయి. డైటిషియన్‌లు సూచిస్తున్న కొన్ని ముఖ్యమైన ఫలాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Belly Fat – ఆపిల్ (సేబు పండు):
సేబులో తక్కువ క్యాలరీలు ఉండడమే కాకుండా, ఇందులో చక్కెర కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ పండు తినడం వలన ఆకలి తగ్గి, ఎక్కువ తినే అలవాటును నియంత్రించవచ్చు. అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మేలు చేస్తుంది.
టమాటా:
టమాటాల్లో ఉండే “కార్నిటిన్” అనే అమినో యాసిడ్ శరీరంలో మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే, ఇందులో ఉండే 9-oxo-ODA అనే సంయోగం రక్తంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. టమాటాల్లో ఉన్న ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు తక్కువ తినే అలవాటును అభివృద్ధి చేస్తుంది.
జామకాయ:
జామకాయలో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగించి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఫలితంగా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది.
పైనాపిల్:
ఈ పండులో ఉండే “బ్రోమెలైన్” అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు కడుపు బ్లోటింగ్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
కివి:
కివిలో విటమిన్ C, ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది జీర్ణక్రియను మెరుగుపరచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహకరిస్తుంది.
ఈ ఫలాలను రోజువారీ ఆహారంలో చేర్చడం ద్వారా బరువు నియంత్రణలో పెట్టుకోవచ్చు. అయితే, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మార్పులు చేసేముందు తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. మేము అందిస్తున్న ఈ సమాచారం నిపుణుల సూచనల ఆధారంగా మాత్రమే అందించబడింది.
Also Read : Ajwain Leaves Interesting Benefits : వాము ఆకు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్య పోతారు



















