BCCI : దుబాయ్ : ఆసియా కప్ 2025 మెగా టోర్నీ ముగిసినా భారత్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డుల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టోర్నీలో భారత్ జైత్రయాత్ర సాగించింది. ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి ఛాంపియన్ గా నిలిచింది. గెలుపొందిన భారత జట్టుకు ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, పీసీబీ చైర్మన్ , పాకిస్తాన్ కేంద్ర మంత్రి మొహిసిన్ నఖ్వీ ఆసియా కప్ ట్రోఫీని ఇవ్వకుండా వెళ్లి పోవడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) . ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వక పోడడంతో బీసీసీఐ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
BCCI Files Complaint on ACC Chairman Moshin Naqvi
ఇదిలా ఉండగా ఆసియా కప్ ను నఖ్వీ తన హోటల్ గదిలోనే ఉంచుకున్నట్లు సమాచారం. ఈ మేరకు నఖ్వీపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్‌లోని ఇతర బోర్డుల మద్దతుతో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది.
ఈ క్రమంలో నిన్న జరిగిన ఆసియా క్రికెట్ కౌన్సిల్ సమావేశం నుంచి ప్రతినిధులు ఆశిష్ షెలార్, రాజీవ్ శుక్లా వాకౌట్ చేశారు. కాగా ఇటీవల పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ లో 26 మంది ప్రయాణీకులను కాల్చి చంపారు. దీంతో భారత్ ఆపరేషణ్ సిందూర్ చేపట్టింది. ఈ సందర్బంగా టీమిండియా పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చేసేందుకు ఒప్పుకోలేదు. అంతే కాకుండా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ కీలక ప్రకటన చేశాడు. తాము ఆసియా కప్ గెలిస్తే నఖ్వీ నుంచి తీసుకోమంటూ ప్రకటించాడు.
Also Read : INDW vs SLW India Victory : వరల్డ్ కప్ లో బోణీ కొట్టిన భారత్


















