Dream11 : ముంబై – కేంద్ర సర్కార్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు తీసుకు రావడంతో దాని ప్రభావం బీసీసీఐపై పడనుంది. ఈ మేరకు ఇప్పటి వరకు టైటిల్ స్పాన్సర్ గా ఉంది ఆన్ లైన్ గేమింగ్ సంస్థ డ్రీమ్ 11. తాజాగా పరిణామాల నేపథ్యంలో సదరు సంస్థ స్పాన్సర్ గా ఉండేందుకు వీలులేదు. ఇదిలా ఉండగా డ్రీమ్11 (Dream11) ఇండియన్ సూపర్ లీగ్ అధికారిక ఫాంటసీ భాగస్వామి కూడా. భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌గా ఉండటానికి డ్రీమ్11 2023-2026లో రూ. 358 కోట్ల ఒప్పందాన్ని కలిగి ఉంది.
BCCI Lose Dream11
ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు ఉభయ సభలలో ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్ 2025 ప్రమోషన్ నియంత్రణ’ బిల్లును ఆమోదించింది. దీంతో ఇటీవల తన రియల్ మనీ గేమ్‌లను మూసివేసింది ఫాంటసీ స్పోర్ట్స్ దిగ్గజం డ్రీమ్ 11. భారత క్రికెట్ జట్టు టైటిల్ స్పాన్సర్‌షిప్‌ను కొనసాగించ లేమని బీసీసీఐకి తెలియజేసింది, ఎందుకంటే ఆదాయ ప్రవాహం తీవ్రంగా దెబ్బ తింటుందని పేర్కొంది.
తొలిసారిగా క్రికెట్ ఆదాయ ప్రవాహంపై కొత్త బిల్లు ప్రభావం చూపుతుందని నివేదించింది. డ్రీమ్ 11 , మై 11 సర్కిల్ లు సంయుక్తంగా భారత క్రికెట్ జట్టు, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్ స్పాన్సర్‌షిప్ ద్వారా ఈ రెండు సంస్థలు కలిపి బీసీసీఐకి రూ. 1000 కోట్ల మేర లాభం వస్తుంది.
ఎవరూ ఆన్‌లైన్ మనీ గేమింగ్ సేవలను అందించకూడదు, సహాయం చేయకూడదు, ప్రోత్సహించ కూడదు, ప్రేరేపించ కూడదు, పాల్గొన కూడదు లేదా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఏదైనా ఆన్‌లైన్ మనీ గేమ్ ఆడటానికి ఏ వ్యక్తిని ప్రోత్సహించే ఏ ప్రకటనలో పాల్గొన కూడదు అంటూ బిల్లును తీసుకు వచ్చింది.
Also Read : JD Vance Shocking Comments : యుద్ధం ఆపేందుకే భారత్ పై సుంకాలు



















