BCCI : ముంబై : బీసీసీఐ సంచలన ప్రకటన చేసింది. ఆసియా కప్ 2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి ఏకంగా రూ. 21 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించింది. ఈ మధ్య ఇంత భారీ ఎత్తున ప్రకటించడం విశేషం. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. విజేతగా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ఏ ఒక్క మ్యాచ్ ఓడి పోలేదు. అంతే కాదు బారత జట్టు చేతిలో దాయాది పాకిస్తాన్ మూడుసార్లు ఓటమి పాలైంది. లీగ్ మ్యాచ్ లలో పరాజయం పాలు కాగా ఫైనల్ లో కూడా చావు దెబ్బ తిన్నది పాకిస్తాన్. ఆ జట్టుకు చెందిన ఆటగాళ్లు వేసిన వేషాలు, ప్రదర్శించిన వ్యతిరేక ప్రదర్శనలు తీవ్ర ఆగ్రహానికి తెప్పించాయి.
BCCI Huge Gift
అయినా భారత జట్టు ఎక్కడా సంయమనం కోల్పోలేదు. తన ఆట ద్వారా పాకిస్తాన్ కు బిగ్ షాక్ ఇచ్చింది. చుక్కలు చూపించింది. ఫైనల్ మ్యాచ్ లో మొదటగా పాకిస్తాన్ 146 పరుగులకే చాప చుట్టేసింది. ఆ తర్వాత మైదానంలోకి దిగిన భారత జట్టు 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో ఇంకా 2 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఆసియా కప్ ను స్వంతం చేసుకుంది. అంతే కాదు భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) సంచలన ప్రకటన చేశాడు. తమ మ్యాచ్ లకు సంబంధించి చెల్లించే ఫీజుల ద్వారా వచ్చే డబ్బులను పూర్తిగా భారత దేశ సైన్యానికి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు.
Also Read : Popular Cricketer Surya Kumar Yadav : భారత సైన్యానికి సూర్య కుమార్ యాదవ్ విరాళం



















