BC Janardhan Reddy : అమరావతి : ఏపీకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). నల్వా ఏరో ప్రవేట్ లిమిటెడ్ ప్రతినిథులు మంత్రితో బేటీ అయ్యారు సచివాలయంలో. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి వద్ద తమ ఆసక్తిని వ్యక్తం చేశారు సంస్థ ఫౌండర్ కుల్జిత్ ఎస్. సంధూ. దేశంలో మొదటి 5 – సీటర్ ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాన్ని అభివృద్ధి చేస్తోంది నల్వా ఏరో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. అధునాతన ఎయిర్ మొబిలిటీ కోసం లాంగ్-రేంజ్ ప్యాసింజర్ విమానాలను తయారు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది పంజాబ్ కు చెందిన ఈ కంపెనీ. ఆర్ అండ్ డి సెంటర్, ప్రోటో టైప్ డెవలప్‌మెంట్ యూనిట్, ఈవీఓఐఎల్ విమానాల కోసం పూర్తి స్థాయి తయారీ సౌకర్యం, పైలట్ల కోసం ప్రపంచ స్థాయి ఫ్లయింగ్ శిక్షణా సంస్థలు ఏర్పాటుకు దాదాపు 100 ఎకరాల భూమి అవసరమని తెలియ చేసింది ఈ సందర్బంగా మంత్రి జనార్దన్ రెడ్డి.
AP Minister BC Janardhan Reddy Key Comments
అనంతపురం పరిసర ప్రాంతాల్లో తమ సంస్థ ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ ఏకోసిస్టమ్ కల్పనకు రాబోయే 10 ఏళ్లలో దాదాపు రూ. 800 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు పేర్కొన్నారు సంధు. ఇదిలా ఉండగా పెట్టుబడులు పెట్టేందుకు పూర్తి స్థాయి ప్రతిపాదనలతో ముందుకు వస్తే, ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అనంతరం మంత్రి కర్నూల్ జిల్లాలో పర్యటించారు. ఈనెల 16న ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. సన్నాహక ఏర్పాట్లపై సమీక్షంచారు సహచర మంత్రులు అనగాని సత్య ప్రసాద్, పయ్యావుల కేశవ్ , టీజీ భరత్ తో కలిసి జనార్దన్ రెడ్డి.
Also Read : CM Revanth Reddy Clear Instructions : ప్రజా ప్రతినిధులకు సీఎం దిశా నిర్దేశం

















