BC Janardhan Reddy Huge Planing : యాగంటిలో ఏర్పాట్లు ఘ‌నంగా చేప‌ట్టాలి

మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి స‌మీక్ష

Hello Telugu - BC Janardhan Reddy Huge Planing

Hello Telugu - BC Janardhan Reddy Huge Planing

BC Janardhan Reddy : అమ‌రావ‌తి : యాగంటిలో కార్తీక మాసం సన్నాహక ఏర్పాట్లపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy) సమీక్ష నిర్వ‌హించారు. కార్తీక మాసం పురస్కరించుకుని ప్రముఖ శైవ పుణ్యక్షేత్రం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న సన్నాహక ఏర్పాట్లపై రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా యాగంటిలో జరుగుతున్న ఏర్పాట్లపైఅధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. బుధవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో యాగంటికి పెద్ద ఎత్తున జిల్లా నలుమూలల నుంచి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.

Minister BC Janardhan Reddy Key Comments

భక్తులు తాగునీటి కోసం ఇబ్బంది పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, ఆలయ పరిసరాల్లో పారిశుద్ధ్యం విషయంలో సీరియస్ గా తీసుకుని పని చేయాలని ఆర్ డబ్ల్యు ఎస్ అధికారులను ఆదేశించారు. కార్తీక పౌర్ణమి వంటి పుణ్య దినాలలో ఆలయానికి భక్తుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ సమయంలో టోల్ గేట్ ఫీజును రద్దు చేయాలని స్పష్టం చేశారు. ఆలయానికి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, అదనపు ఆర్టీసీ సర్వీసులను ఏర్పాటు చేయాలని సూచించారు. ఆలయంలో విద్యుత్ అంతరాయం లేకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు. క్యూలైన్లలో రద్దీకి ఆస్కారం లేకుండా త్వరితగతిన భక్తులకు దర్శనం అందించడం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. ఆలయ పరిసరాల్లో హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడంతో పాటు ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా సిద్ధం చేసి ఉంచాలన్నారు.

Also Read : Rohit Sharma Interesting Comments on Nitish : అన్ని ఫార్మాట్ ల‌కు నితీష్ రెడ్డి స‌రిపోతాడు

Exit mobile version