ఇండియాకు షాక్ ఇచ్చిన బంగ్లాదేశ్

ఐసీసీకి తేల్చి చెప్పిన బీసీబీ

hellotelugu-BangladeshCricketBoard

దుబాయ్ : భార‌త్, శ్రీ‌లంక సంయుక్తంగా నిర్వ‌హించ‌బోయే ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో తాము మ్యాచ్ లు ఆడ‌బోమంటూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు. ఇందుకు సంబంధించి బుధ‌వారం ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కంట్రోల్ కౌన్సిల్ (ఐసీసీ) వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వహించింది. ఇందులో ప్ర‌త్యేకంగా బీసీబీ పాల్గొంంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. తాము ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఇండియాతో మ్యాచ్ లు ఆడ‌బోమంటూ తేల్చి చెప్పింది. అయితే తాము త‌ట‌స్థ వేదిక‌లపై ఆడేందుకు సిద్దంగా ఉన్నామ‌ని తెలిపింది బోర్డు. అయితే దీనిపై సీరియ‌స్ గా స్పందించింది ఐసీసీ. మ్యాచ్ లు ఆడేందుకు ఎలాంటి అభ్యంత‌రాలు ఉండ కూడ‌ద‌ని స్ప‌ష్టం చేసింది. దీని వ‌ల్ల పెద్ద ఎత్తున ఆదాయం కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని సూచించింది.

అయినా బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) ఒప్పుకునేది లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టింది. దీంతో పున‌రాలోచ‌న‌లో ప‌డింది బోర్డు. అయితే ఐసీసీ పాలకమండలితో చర్చల సందర్భంగా వచ్చే నెల T20 ప్రపంచ కప్ కోసం భారతదేశానికి వెళ్లడానికి నిరాకరించినట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సూచ‌న ప్రాయంగా తెలిపింది. అయితే ఇదే స‌మ‌యంలో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తమ ప్రపంచ కప్ మ్యాచ్‌లను భారతదేశం నుండి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ కోరుతోంది. ప్రపంచ కప్ ఫిబ్రవరి 7న ప్రారంభమవుతుంది . బంగ్లాదేశ్ తమ నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను భారతదేశంలో ఆడనుంది. ఇండియా, బంగ్లాదేశ్ దేశాల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త‌త‌ల న‌డుమ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్) నుంచి బంగ్లా దేశానికి చెందిన స్టార్ పేస‌ర్ ముజ‌ఫిర్ రెహ‌మాన్ ను కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్ ) వ‌దిలేసుకుంది. దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఐపీఎల్ వేలం పాట‌లో అత్య‌ధిక ధ‌ర‌కు కొనుగోలు చేసింది. త‌నను రూ. 9.20 కోట్ల‌కు తీసుకుంది.

Exit mobile version