Bangladesh Court : బంగ్లాదేశ్ : బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాకు కోలుకోలేని షాక్ తగిలింది. సోమవారం సంచలన తీర్పు వెలువరించింది బంగ్లాదేశ్ కోర్టు (Bangladesh Court). పలువురి మరణానికి తనే కారణమని పేర్కొంటూ షేక్ హసీనాకు మరణ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. తగ ఏడాది 2024లో జరిగిన విద్యార్థుల తిరుగుబాటుపై ఘోరమైన అణిచివేతకు తనే కారణమని పేర్కొంది. 79 ఏళ్ల మాజీ నాయకురాలలు గైర్హాజర్ కావడం పట్ల అంతర్జాతీయ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తనకు కోలుకోలేని రీతిలో ఉరి శిక్ష విధిస్తున్నట్లు తీర్పు చెప్పింది. విచారణ కోసం భారతదేశం నుండి తిరిగి రావాలని కోర్టు ఆదేశాలను ధిక్కరించిన తర్వాత షేక్ హసీనా మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు తేలింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు కారణమయ్యే అన్ని అంశాలు నెరవేరాయని న్యాయమూర్తి గోలం మోర్టుజా మొజుందర్ ఢాకాలోని కిక్కిరిసిన కోర్టుకు చదివి వినిపించారు.
Bangladesh Court Shocking Verdict on Sheikh Hasina
దేశ వ్యాప్తంగా అన్ని ఛానెళ్లలో ప్రసారం అయ్యింది. అంతే కాకుండా బంగ్లాదేశ్ ప్రత్యేక ట్రిబ్యునల్ మాజీ హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్ కమల్‌కు మరణశిక్ష విధించింది. ఇదిలా ఉండగా ఆగస్టు 2024 ప్రారంభంలో వారాల తరబడి అశాంతి నెలకొన్న తర్వాత ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. భారీ భద్రత మధ్య తను భారత దేశంలో ఆశ్రయం పొందింది. సామూహిక నిరసనలు, హింసాత్మక అణిచివేత మధ్య కుటుంబంతో సహా పారి పోయారు. అప్పటి నుండి హసీనా తిరిగి రావడానికి షరతులు వ్యక్తం చేసింది. అంతే కాకుండా భాగస్వామ్య ప్రజాస్వామ్యం కింద స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, సమగ్ర ఎన్నికలను నిర్వహించాలని, అవామి లీగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక షేక్ హసీనా సెప్టెంబర్ 28, 1947లో తూర్పు పాకిస్తాన్ లో పుట్టారు. ఆమె తండ్రి బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రెహమాన్. 1975లో సైనిక తిరుగుబాటు కారణంగా తన కుటుంబంలో ఎక్కువ మంది దారుణ హత్యకు గురయ్యారు.
Also Read : K Kavitha Fired on Govt : లెదర్ పార్క్ పరిశ్రమ ఆలస్యంపై కవిత ఫైర్















