Bandi Sanjay : హైదరాబాద్ – కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. కల్వకుంట్ల ఫ్యామిలీని లక్ష్యంగా చేసుకున్నారు. తన కొడుకు మంచి బట్టలు వేసుకుంటే కూడా ఓర్చుకోలేక పోతున్నారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బిచ్చపోల్ల లాగా ఉండాలా అని ప్రశ్నించారు. ఈ మధ్యనే ఇల్లు కొనుగోలు చేశానని, దానికి కూడా ఓరుస్త లేరంటూవ ఆపోయారు. సోమవారం బండి సంజయ్ కుమార్ పటేల్ (Bandi Sanjay) మీడియాతో మాట్లాడారు. నువ్వు మీ అయ్య, మీ అమ్మ రాండ్రి అంటూ సవాల్ విసిరారు.
Union Minister Bandi Sanjay Slams
రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం ఉందంటూ మండిపడ్డారు. ఓ వైపు దాడులకు దిగుతామంటూ బహిరంగంగా ప్రకటనలు చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంకోసారి భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలను పనిగట్టుకుని లక్ష్యంగా చేసుకుని చులకన చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు బండి సంజయ్ కుమార్ పటేల్. తోడ్కలు తీస్తామంటూ హెచ్చరించారు.
వ్యవస్థలను నిర్వీర్యం చేసింది చాలక పైగా అధికారం పోయినా ఆ మదం ఇంకా పోలేదని ఫైర్ అయ్యారు. జనం అన్నీ గమనిస్తున్నారని, ఇకనైనా బుద్దిగా మాట్లాడేలా నేర్చుకుంటే మంచిదని హితవు పలికారు కేంద్ర మంత్రి. రాష్ట్రంలో తమ నేతలను అంటే చూస్తూ ఊరుకునేది లేదని, కాన్వాయ్ లు తిరగకుండా చేస్తామని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆయన ప్రధానంగా మాజీ మంత్రి కేటీఆర్, హరీశ్ రావు, కల్వకుంట్ల కవిత, మాజీ సీఎం కేసీఆర్ లను టార్గెట్ చేయడం కలకలం రేపింది.
Also Read : YS Sharmila Shocking Comments : యూనివర్శిటీ విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరం
















