హైదరాబాద్ : దసరా పండుగ వేళ నందమూరి బాలయ్య అభిమానులకు తీపి కబురు చెప్పారు మూవీ మేకర్స్. ఇప్పటికే దమ్మున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన అఖండ దుమ్ము రేపింది. వసూళ్లలో రికార్డు బ్రేక్ చేసింది. ఇందులో పవర్ ఫుల్ గా చూపించాడు బాలయ్య బాబును. అఖండ -1 మూవీ సక్సెస్ కావడంతో దర్శక, నిర్మాతలు అఖండ సీక్వెల్ ప్రకటించారు. ఈ మేరకు సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగింది. కుంభమేళాలో కూడా బాలయ్యతో చిత్రీకరించారు దర్శకుడు బోయపాటి శ్రీను. ఇదిలా ఉండగా గురువారం మూవీ మేకర్స్ నుంచి కీలక అప్ డేట్ వచ్చింది. అఖండ -2ను ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో బాలయ్య అభిమానులు సంబురాలలో మునిగి పోయారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్ కెవ్వు కేక అనిపించేలా ఉన్నాయి. దీంతో మరోసారి బాలయ్య హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు సినీ వర్గాలు.
ఇదిలా ఉండగా ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా నటించగా ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్ర కీలక పాత్రల్లో నటించారు. 14 రీల్స్ ప్లస్ కింద రామ్ ఆచంట , గోపీచంద్ ఆచంట భారీ ఖర్చుతో నిర్మిస్తున్నారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో ఈ చిత్రం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. బాలకృష్ణ భారీ త్రిశూలాన్ని పట్టుకుని భయంకరమైన, దైవిక అవతారంలో కనిపించిన విడుదల పోస్టర్ ఇప్పటికే ఇంటర్నెట్లో సందడి చేసింది. ఇక దమ్మున్న సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ హై-వోల్టేజ్ స్కోర్ అఖండ -2కు ప్లస్ పాయింట్ కానుంది. ఇప్పటికే ఓజీతో దుమ్ము రేపిన థమన్ ఈసారి బాలయ్యకు మరోసారి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చేందుకు ప్లాన్ చేశాడని టాక్.


















