బాబ‌ర్ ఆజం, షాహీన్ అఫ్రిదికి బిగ్ షాక్

సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న పాక్ బోర్డు

hellotelugu-PCBDrop

పాకిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. వ‌చ్చే ఏడాది 2026 ఫిబ్ర‌వ‌రిలో భార‌త్ , శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను నిర్వ‌హిస్తున్నాయి. దీంతో ఆయా దేశాల‌కు సంబంధించిన క్రికెట్ బోర్డులు తుది జ‌ట్ల‌ను ఎంపిక చేశాయి. ఈ త‌రుణంలో శ్రీ‌లంక‌తో సీరీస్ ఆడాల్సి ఉంది పాకిస్తాన్ జ‌ట్టు. ఇందుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. పాకిస్తాన్ టీంను ఖ‌రారు చేసింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ దేశ జ‌ట్టుకు వ‌ర‌ల్డ్ వైడ్ గా పేరు తీసుకు రావ‌డంలో, కీల‌క‌మైన పాత్ర పోషించ‌డంలో పేరు పొందిన మాజీ కెప్టెన్ బాబ‌ర్ ఆజ‌మ్ ను, టాప్ బౌల‌ర్ షాహీన్ అఫ్రిదికి ఈ తాజా జ‌ట్టులో చోటు క‌ల్పించ‌లేదు. ఒక నెల ముందు ఇలా ప‌క్క‌న పెట్ట‌డం విస్తు పోయేలా చేసింది.

సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ లు ఆడ‌నుంది పాకిస్తాన్ జ‌ట్టు శ్రీ‌లంక జ‌ట్టుతో. ఆడే జ‌ట్టులో 15 మందిని ప్ర‌క‌టించింది. 11 మంది ఆడ‌గా మిగ‌తా ప్లేయ‌ర్లు స్టాండ్ బైగా ఉండ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఈ కీల‌కమైన టోర్నీకి ముందు స‌న్నాహ‌క సీరీస్ కు సిద్దం అవుతోంది పాకిస్తాన్ టీం. ఈ స‌మ‌యంలో జ‌ట్టులో మ‌రికొంద‌రు కీల‌క ఆట‌గాళ్లుగా గుర్తింపు పొందిన మ‌హ్మ‌ద్ రిజ్వాన్, హౌరిస్ రవూఫ్ ను కూడా త‌ప్పించింది సెలెక్ష‌న్ బోర్డు. సీరీస్ జనవరి 7 నుండి జనవరి 11 వరకు జరగనుంది. పాక్ జ‌ట్టుకు స‌ల్మాన్ అలీ ఆఘాకు జ‌ట్టు బాధ్య‌త‌లుఅప్ప‌గించారు. ఇదిలా ఉండ‌గా ఇప్ప‌టికే టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ఛాంపియ‌న్ గా భార‌త్ జ‌ట్టు ఉంది.

Exit mobile version