Baahubali : హైదరాబాద్ : భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ స్వంతం చేసుకున్న ఏకైక దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. తను తీసింది కొన్ని మూవీసే. కానీ ప్రతి మూవీ దేనికదే ప్రత్యేకం. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. తాజాగా తను మరో సంచలన చిత్రం తీసే పనిలో పడ్డాడు. ఇంకా పేరు ఖరారు చేయని ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. పూర్తిగా అడ్వెంచరస్ నేపథ్యంతో తెరకెక్కించే పనిలో పడ్డాడు జక్కన్న. తనకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. తను ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తదితర నటీనటులతో బిగ్ మూవీ ప్లాన్ చేశాడు. షూటింగ్ కొనసాగుతోంది. కొంత విరామ సమయంలో మరో ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు దర్శక ధీరుడు.
Baahubali Re-release Updates
తను దర్శకత్వం వహించి రికార్డు బ్రేక్ చేసి కాసుల వర్షం కురిపించిన మూవీ బాహుబలి (Baahubali). దీనిని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు వదిలాడు ఎస్ఎస్ రాజమౌళి. ప్రస్తుతం ఈ మూవీ నిర్మాతల నుంచి ఖుష్ కబర్ వచ్చింది. ఈ సినిమాను అక్టోబర్ 31న వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించి బాహుబలి మూవీకి కొత్తగా మెరుగులు దిద్దే పనిలో పడ్డాడు దర్శకుడు. అదనపు సీన్స్ కూడా జోడిస్తారని, అంతే కాకుండా భారీ ఎత్తున కలెక్షన్స్ కురిపించేలా ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మొత్తంగా ఎస్ఎస్ రాజమౌళి అంటేనే ఓ లెజెండ్. తను ఎలాంటి గ్రాఫిక్స్ ను జోడిస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది సినీ ప్రేక్షకులలో.
Also Read : H-1B Visa Hike Sensational : హెచ్ -1బి వీసాల రుసుము పెంపుపై కోర్టులో దావా

















