Hero Prabhas-Baahubali : ప్ర‌భాస్ బాహుబ‌లి రీ రిలీజ్ కు సిద్దం

సినిమా విడుద‌లై 10 సంవ‌త్స‌రాలు

hellotelugu-baahubali

Baahubali : ఇప్పుడు టాలీవుడ్ లో రీ రిలీజ్ ల కాలం న‌డుస్తోంది. గ‌తంలో విడుద‌లై విజ‌య‌వంత‌మైన సినిమాలు తిరిగి ప్రేక్ష‌కుల ముందుకు మ‌రోసారి వ‌స్తున్నాయి. వాటిలో పాన్ ఇండియా హీరో డార్లింగ్ ప్ర‌భాస్ , అనుష్క శెట్టి కీ రోల్స్ పోషించిన చిత్రం బాహుబ‌లి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే డేట్ కూడా ఫిక్స్ చేశారు మూవీ మేక‌ర్స్. విజ‌యేంద్ర ప్ర‌సాద్ అందించిన క‌థ‌, కీర‌వాణి సంగీతం, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌లు వెర‌సి ఆస్కార్ అవార్డు అందుకున్న ఆర్ఆర్ఆర్ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి (SS Rajamouli) ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం బాహుబ‌లి. భార‌తీయ సినీ చ‌రిత్ర‌లో రికార్డుల మోత మోగించింది.

Baahubali Re-release Updates

ఈ చిత్రం విడుద‌లై 10 ఏళ్లు పూర్త‌య్యాయి. చూస్తూ ఉండ‌గానే క‌ళ్ల ముందు అలా వ‌చ్చి వెళ్లి పోయింది.
మాహిష్మతి సామ్రాజ్యం మళ్లీ మన కళ్ల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌. త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో కీల‌క అప్ డేట్ పంచుకున్నారు. బాహుబ‌లి ది ఎపిక్ అనే టైటిల్ తో ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తామ‌న్నారు. ఇందుకు సంబంధించి తేదీ కూడా ఖ‌రారు చేసిన‌ట్లు తెలిపారు. వ‌చ్చే అక్టోబ‌ర్ 31న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంద‌న్నారు.

ఎన్నో ప్ర‌యాణాల‌కు కేరాఫ్ ఈ చిత్రం. లెక్క‌లేన‌న్ని జ్ఞాప‌కాలు మాలో ఉన్నాయి. అంతులేని రీతిలో స్పూర్తి నింపింద‌ని పేర్కొన్నారు ఎస్ఎస్ రాజ‌మౌళి. 10 ఏళ్లు పూర్తి కావ‌డం త‌న‌ను మ‌రింత విస్తు పోయేలా చేసింద‌న్నాడు. బాహుబ‌లిలో ప్ర‌భాస్ , రానా, అనుష్‌క‌, త‌మ‌న్నా, ర‌మ్య కృష్ణ‌, నాజ‌ర్, స‌త్య రాజ్ , త‌దిత‌ర ప్ర‌ముఖ న‌టులు న‌టించారు. ఇది రెండు పార్ట్స్ గా తీశాడు. ప్ర‌స్తుతం మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేశాడు జ‌క్క‌న్న‌. త్వ‌ర‌లోనే మ‌హేష్ మూవీ అయి పోయాక బాహుబ‌లి -3 తీస్తానంటూ వెల్ల‌డించాడు.

Also Read : Thandel Movie Sensational : టెలివిజ‌న్ ప్రీమియ‌ర్ లో తండేల్ హ‌వా

Exit mobile version