Australia : చండీగఢ్ : భారత దేశంలో మహిళా క్రికెట్ జట్టుతో వన్డే సీరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా (Australia) మహిళా జట్టుకు కోలుకోలేని షాక్ తగిలింది. సీరీస్ లో భాగంగా తొలి మ్యాచ్ లో ప్రత్యర్థి జట్టు దుమ్ము రేపింది. భారత్ పై అద్భుత విజయాన్ని నమోదు చేసింది. దీంతో తీవ్ర ఒత్తిడికి లోనైంది టీమిండియా. కానీ న్యూచండీగఢ్ వేదికగా జరిగిన 2వ వన్డే మ్యాచ్ లో ఆసిస్ జట్టుకు చుక్కలు చూపించింది. భారత జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ప్లేయర్ స్మృతీ మంధాన షాక్ ఇచ్చింది. తన కెరీర్ లో ఏకంగా 12వ సెంచరీ సాధించింది. ఆసిస్ బౌలర్లను ఉతికి ఆరేసింది. దీంతో భారీ స్కోర్ నమోదు చేసింది. ఏకంగా ఆసిస్ ను 102 పరుగుల భారీ తేడాతో ఓడించింది. తమకు ఎదురు లేదని చాటింది టీమిండియా.
Australia Womes Cricket Team Shocking
ఇదిలా ఉండగా భారత్‌తో జరిగిన రెండో వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా టీంకు జరిమానా విధించారు .ఆస్ట్రేలియా లక్ష్యానికి రెండు ఓవర్లు తక్కువగా ఉందని తీర్పు ఇవ్వబడినందున ఐసిసి ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీల జిఎస్ లక్ష్మి ఈ ఆంక్షలు విధించారు. ఇందులో భాగంగా మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. కనీస ఓవర్-రేట్ కు సంబంధించిన ఆటగాళ్లు, ఆటగాళ్ల సహాయక సిబ్బంది కోసం ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22 ప్రకారం, ఆటగాళ్లు తమ జట్టు నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయని ప్రతి ఓవర్‌కు వారి మ్యాచ్ ఫీజులో ఐదు శాతం జరిమానా విధించబడుతుందని ఐసీసీ కీలక ప్రకటన చేసింది. ఈ సందర్భంగా ఆసిస్ జట్టు స్కిప్పర్ అలిస్సా హీలీ ప్రతిపాదిత శిక్షను అంగీకరించింది.
Also Read : Minister Satya Kumar Yadav Interesting : ఏపీలో మెరుగుపడిన ఆరోగ్య సేవలు


















