విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. పచ్చదనం, పర్యావరణానికి ఆంధ్ర యూనివర్శిటీ క్యాంపస్ ఆదర్శంగా మారాలని అన్నారు. .నెట్ జీరో క్యాంపస్ గా తీర్చిదిద్దాలని ఆదేశించానని తెలిపారు. ఎంతో విశిష్టమైన ప్రముఖులను ఏయూ తయారు చేసిందని చెప్పారు. ఎండలు విపరీతంగా పెరిగాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని వాపోయారు. ఓవైపు విపరీతమైన ఎండలు.. లేకుంటే తుఫానులు వస్తున్నాయని తెలిపారు సీఎం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి చేసుకోవాలి… ఏయూకు 450 ఎకరాల ల్యాండ్ ఉందన్నారు . ఖాళీ ప్రదేశాల్లో చెట్లు పెట్టాలి… బిల్డింగులపై సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. క్యాంపస్‌కు అవసరమైన విద్యుత్ సోలార్ ద్వారానే వచ్చేలా చూడాలన్నారు నారా చంద్రబాబు నాయుడు.
తిరుమలలో 89.5 శాతం గ్రీనరీ ఉందని చెప్పారు. ఏయూ క్యాంపస్ బయో డైవర్శిటీ పార్కుగా రూపాంతరం చెందాలని స్పష్టం చేశారు. .సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ చేపట్టాలన్నారు. వేస్ట్ నుంచి బయో గ్యాస్ ఉత్పత్తి చేసేలా చూడాలన్నారు..స్వచ్ఛ పథం కింద రీ-సైక్లింగ్‌కు పంపాలన్నారు సీఎం. వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లను వినియోగించు కోవాలని కోరారు. వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేపట్టాలని ఆదేశించామన్నారు. పీఎన్జీ, ఎలక్ట్రికల్ స్టవ్స్ ను వంటలకు వినియోగించు కోవాలని కోరారు . నెట్ జీరో విధానం అమలు చేయడానికి ప్రొఫెసర్స్ టీం ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులకు ఏయూ క్యాంపస్ ఓ నాలెడ్జ్ హబ్ గా తయారు కావాలన్నారు.
నెట్ జీరో విధానం అమలు విషయంలో అన్ని విద్యా సంస్థలను గైడ్ చేసేలా ఏయూ అభివృద్ధి చేయాలని సూచించారు సీఎం. యూనివర్శిటీ అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నాం అన్నారు. యూనివర్శిటీ అభివృద్ధికి విద్యార్థులు భాగస్వాములుగా ఉండాలన్నారు. ఇవాళ పర్యావరణ దినోత్సవం.. ప్రజలకు అవగాహన పెంచేందుకు నేను సైకిల్ మీదే ప్రయాణిస్తానని అన్నారు. సైకిలింగ్ అనేది జీవన విధానం కావాలన్నారు. విశాఖలో ప్రత్యేకంగా సైకిలింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తున్నాం అని ప్రకటించారు.

















