ఢిల్లీ : ఎయిర్ లైన్స్ లపై నియంత్రణ కలిగిన డీజీసీఏ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రధానంగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి ట్రోల్ కు గురయ్యాడు. ఓ వైపు ప్రయాణీకులు నానా తంటాలు పడుతున్నారు. అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచడం, ఉన్నట్టుండి ఫ్లైట్స్ ను రద్దు చేయడం పట్ల దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అయ్యింది. ఈ తరుణంలో దిద్దుబాటు చర్యలకు దిగింది కేంద్రం. ఈ మేరకు తన ఆధీనంలో ఉన్న డీజీసీఏలో ప్రక్షాళన ప్రారంభించింది. డిసెంబర్ 5న ఇండిగో విమానాల రద్దు తర్వాత దాదాపు 20 రోజుల అనతరం డీజీసీఏ నుండి బదిలీ అయ్యారు జామ్వాల్. వివిధ విమానయాన సంస్థల నుండి కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడిన నలుగురు ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్లను డీజీసీఏ గతంలో తొలగించింది.
ఇదే క్రమంలో ప్రధానంగా ఇండిగో వైఫల్యం ఫలితంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ తన డైరెక్టర్ ఆపరేషన్స్ గా ఉన్న రవీందర్ జామ్వాల్‌ను ఫ్లైట్ స్టాండర్డ్స్ డైరెక్టరేట్ అదనపు బాధ్యతల నుండి తప్పించింది. ఆయన స్థానంలో ఆ బాధ్యతను మరొకరికి అప్పగించింది. డీజీసీఐలో జామ్వాల్ ఎఫ్‌డీటీఎల్ రూల్స్ కు బాధ్యత వహించారు. ఇది భారీ ఎత్తున విమానాల రద్దుకు దారి తీసిందన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ చర్యకు డీజీసీఏ తన వైపు నుంచి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఎయిర్‌స్పేస్ , ఎయిర్ నావిగేషన్ సర్వీసెస్ స్టాండర్డ్స్ ప్రస్తుత బాధ్యతతో పాటు ఫ్లైట్ స్టాండర్డ్స్ డైరెక్టరేట్ కు సంబంధించి అదనపు బాధ్యతను నిర్వహిస్తున్న ఆపరేషన్స్ డైరెక్టర్ ను బదిలీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఆయన స్థానంలో డిప్యూటీ డైరెక్టర్ ఆపరేషన్స్ ఆశిస్ దూబే నియమితులయ్యారు.
















