అమరావతి : ఏపీలో అర్నాబ్ తుపాను కారణంగా భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని స్పష్టం చేసింది ఏపీ కూటమి సర్కార్. ఈ మేరకు కేంద్ర బృందం నష్టం తీవ్రతను అంచనా వేసేందుకు ఏపీలో పర్యటించింది. ఈ సందర్బంగా మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యింది. అంతకు ముందు సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర సీఎస్ ఆధ్వర్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ముందస్తు తుపాను కారణంగా వాటిల్లిన నష్టం అంచనాలతో ఓ పూర్తి స్తాయి నివేదికను తయారు చేశారు. ఈ మేరకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిందని ఈ సందర్బంగా కేంద్ర పరిశీలక బృందానికి తెలియ చేశారు సీఎం. వారికి పూర్తి వివరాలు వెల్లడించారు. ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. తుపాను నష్టానికి సంబంధించి ప్రాథమిక నివేదికను ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు త్వరితగతిన రాష్ట్రానికి చేరుకున్న కేంద్ర బృందానికి ధన్యవాదాలు తెలిపారు నారా చంద్రబాబు నాయుడు. ‘రియల్ టైమ్ గవర్నెన్స్స , వివిధ సాంకేతికతల అనుసంధానం ద్వారా ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించ గలిగామని ఆయన పేర్కొన్నారు. ‘అర్నాబ్’ తుపాను వల్ల జరిగిన నష్టాన్ని పూర్తిగా సరిదిద్దక ముందే, ఇప్పుడు ‘మురసు’ తుపాను రాష్ట్రాన్ని తాకిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు 7,000 మంది సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నారని తెలిపారు కేంద్ర టీంకు. జరిగిన నష్టాలకు పరిహారం అందేలా కేంద్ర బృందం త్వరగా సిఫార్సులను సిద్ధం చేయాలని ఆయన కోరారు. ప్రాథమిక అంచనాల ప్రకారం, ‘అర్నాబ్’ తుపాను వల్ల రాష్ట్రంలో రూ. 4,526 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది.
