ఢిల్లీ : ప్రముఖ బాలీవుడ్ వివాదాస్పద నటి, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యురాలు కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. ఆస్కార్ అవార్డ్ విన్నర్ , సంగీత దిగ్గజం అల్లా రఖా రెహమాన్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడారు. తన పట్ల వివక్ష కొనసాగుతోందని, ప్రత్యేకించి ఈ దేశంలో గత ఎనిమిది సంవత్సరాలుగా మత పరమైన గొడవలు, విద్వేషాల కారణంగా కులం, మతం ప్రాతిపాదికగా అవకాశాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు రెహమాన్. ఆయన తాజాగా ఓ ఛానల్ తో జరిగిన చిట్ చాట్ సందర్బంగా బాంబు పేల్చారు. ఏకంగా మోదీ సర్కార్ ను పరక్షోంగా ఇరికించే ప్రయత్నం చేశారు. గత కొంత కాలంగా ఈ వివక్ష కొనసాగుతోందని, ఈ దేశంలో సరైన అవకాశాలు నాలాంటి వారికి రాకుండా పోతున్నాయని వాపోయారు.
ఈ సందర్బంగా రెహమాన్ చేసిన కామెంట్స్ పై భగ్గుమన్నారు కంగనా రనౌత్. ఒక అంతర్జాతీయ స్థాయిలో గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు పొందిన మీలాంటి వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదన్నారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. సభ్య సమాజం , ప్రత్యేకించి భారత జాతి మిమ్మల్ని క్షమించదని స్పష్టం చేశారు. ఇకనైనా మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి బహిరంగంగా భారతీయులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సిందేనని, లేకపోతే తీవ్రపరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కంగనా రనౌత్.
