YS Sharmila : కర్నూలు జిల్లా : రాష్ట్రంలో ఉల్లి రైతుల పరిస్థితి దారుణంగా తయారైందని వాపోయారు ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. కనీస మద్దతు ధర కల్పించడంలో సర్కార్ విఫలం అయ్యిందన్నారు. ఎన్నిసార్లు నెత్తి నోరు మొత్తుకున్నా పట్టించు కోలేదన్నారు. గిట్టు బాటు ధర రాక అల్లాడుతుంటే ఆదుకోవాల్సింది పోయి సోయి లేకుండా ఉంటే ఎలా అని ప్రశ్నించారు. సోమవారం కర్నూల్ మార్కెట్ యార్డును వైఎస్ షర్మిలా రెడ్డి (YS Sharmila) సందర్శించారు. ఈ సందర్భంగా రైతులను పరామర్శిచారు. వారిని తను ఓదార్చే ప్రయత్నం చేశారు. విశేషం ఏమిటంటే షర్మిలా రెడ్డికి బాసటగా తన తనయుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
YS Sharmila Slams AP Govt
రైతులను పరామర్శించిన అనంతరం షర్మిలా రెడ్డి ప్రసంగించారు. రాష్ట్రంలో ఉల్లి పంట రైతన్నల కంట కన్నీరు పెట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుతున్న గిట్టుబాటు ధరపై రైతన్నలతో చర్చించానని, వారంతా తమకు గిట్టుబాటు కలగడం లేదంటూ వాపోయారన్నారు. గతేడాది క్వింటాలుకు రూ. 5 వేల వరకు ధర పలుకగా ఇవాళ క్వింటాలుకు గరిష్టంగా రూ. 6 వందల కంటే పలకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారని అన్నారు షర్మిలా రెడ్డి.
ఉల్లిని సాగు చేయాలంటే కనీసం ఎకరాకు పెట్టుబడి రూ. 1.20లక్షల వరకు పెడితే.. వచ్చే ఆదాయం 30 వేలకంటే తక్కువేనని అన్నారు. రైతన్నలు కంట కన్నీరు పెట్టుకున్నా కూటమి సర్కార్ కనికరించక పోవడం దారుణమన్నారు ఏపీపీసీసీ చీఫ్. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 12 వందల ధర కూడా మార్కెట్ లో అందడం లేదన్నారు. వ్యత్యాసం ఉంటే ప్రభుత్వం కలిపి ఇచ్చే సొమ్ము కూడా అకౌంట్ లో పడలేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉల్లి పంటకు క్వింటాలుకు కనీసం 2500 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Also Read : Chinta Mohan Shocking Comments : దామోదరను సీఎం చేసి ఉంటే ఏపీ విడి పోయేది కాదు
