హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసయేషన్ ( హెచ్ సీఏ )కు సంబంధించి ప్రస్తుతం ప్రెసిడెంట్ గా ఉన్న అమర్ నాథ్ ఎన్నిక చెల్దదని ప్రకటించింది.
అంబుడ్స్‌మన్ ఆదేశాల మేరకు అధ్యక్షుడిగా నియమితులైన అమర్‌నాథ్ తన బాధ్యతల నుంచి తప్పుకోవాలని ఆదేశించింది.. ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని (AGM) నిర్వహించి, కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని HCA కార్యదర్శి జీవన్ రెడ్డిని కోర్టు స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా గత కొన్నేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే పలు కేసులు కూడా నమోదయ్యాయి. ఒకరంటే మరొకరికి పడడం లేదు. గత బీఆర్ఎస్ హయాంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన జగన్ మోహన్ రావు ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. తను అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరకు తనను అరెస్ట్ కూడా చేశారు ఈ ప్రభుత్వం వచ్చాక.
మరో వైపు అత్యంత ప్రాధాన్యత కలిగిన హెచ్ సీ ఏలో పాగా వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ కూడా చేస్తున్నట్లు ఆ మధ్యన జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఏది ఏమైనా హెచ్ సీ ఏ వ్యవహారం మరోసారి దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో హెచ్ సీఏ ప్రెసిడెంట్ గా పని చేసిన, ప్రస్తుతం మైనార్టీ సంక్షేమ శాఖా మంత్రిగా ఉన్న మహమ్మద్ అజారుద్దీన్ పై కూడా కేసు నమోదైంది. ఆయన గతంలో భారత జట్టుకు కెప్టెన్ గా ఉన్నాడు. ఇండియాకు పలు విజయాలను చేకూర్చి పెట్టాడు. కానీ తను కూడా ఏమీ చేయలేక చేతులెత్తేశాడు.
