అక్రిడిటేషన్ కార్డుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి

స్ప‌ష్టం చేసిన ఐ అండ్ పీఆర్ క‌మిష‌న‌ర్ ప్రియాంక

hellotelugu-ChekkaPriyanka

హైద‌రాబాద్ : జ‌ర్న‌లిస్టుల‌కు తీపి క‌బురు చెప్పింది రాష్ట్ర ఐ అండ్ పీఆర్ శాఖ‌. ఈ మేర‌కు క‌మిష‌న‌ర్ చెక్క ప్రియాంక కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్‌లో స్టూడియోలను కలిగి ఉండి, స్థానిక/జిల్లా స్థాయిలలో ప్రసారాలు అందించే ఛానెళ్లు రాష్ట్ర, జిల్లా అక్రిడిటేషన్ రెండింటికీ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు. జిల్లా స్థాయి స్టూడియో ఛానెళ్లు తమ తమ జిల్లాలలో దరఖాస్తు చేసుకోవచ్చని స్ప‌ష్టం చేశారు ప్రియాంక‌. ఇందుకు సంబంధించి ద‌ర‌ఖాస్తులు చేసుకునేందుకు ఈనెల 17వ తేదీ వ‌ర‌కు గ‌డువు విధించిన‌ట్లు పేర్కొన్నారు. కేబుల్ న్యూస్ ఛానల్ జర్నలిస్టులు రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

హైదరాబాద్‌లో స్టూడియోలను కలిగి ఉండి, స్థానిక , జిల్లా స్థాయిలలో ప్రసారాలు అందించే ఛానెళ్లు రాష్ట్ర , జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని పేర్కొన్నారు. జిల్లాలలో స్టూడియోలను కలిగి ఉన్న ఛానెళ్లు తమ తమ జిల్లాలలో అక్రిడిటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలిపారు . దరఖాస్తులను ఈ నెల 17వ తేదీన లేదా అంతకంటే ముందుగా నేరుగా సమర్పించాలని అన్నారు. దరఖాస్తులో ఛానల్ పేరు, స్టూడియో చిరునామాతో పాటు, MIB సర్టిఫికేట్, లేబర్ లైసెన్స్ , MSOలతో ఛానల్ ప్లేస్‌మెంట్ ఒప్పందాల కాపీలను జతచేయాలని వెల్ల‌డించారు. అర్హత కలిగిన ఛానెళ్లకు రాష్ట్ర , జిల్లా స్థాయిలలో అక్రిడిటేషన్ కార్డులు జారీ చేస్తామ‌న్నారు.

Exit mobile version