Apollo Tyres : ముంబై : అపోలో టైర్స్ సంచలనంగా మారింది. బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ఏకంగా భారీ ధరకు టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ ను కైవసం చేసుకుంది. ఇది ఓ రికార్డ్ అని చెప్పక తప్పదు. ఇప్పటి వరకు జట్టుకు గతంలో డ్రీమ్ 11 సంస్థ స్పాన్సర్ గా ఉండేది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేంద్రం కీలక తీర్మానం చేసింది. గేమింగ్ ఇండస్ట్రీపై బ్యాన్ విధించింది. దీంతో బీసీసీఐ (BCCI) టీం ఇండియా స్పాన్సర్ షిప్ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. దీంతో ఇటీవల బీసీసీఐ బిడ్స్ ను ఆహ్వానించింది. ఇండియాతో పాటు ఇతర దేశాలకు చెందిన ప్రముఖ వ్యాపార, వాణిజ్య సంస్థలు టీం ఇండియా జెర్సీ స్పాన్సర్ షిప్ కోసం పోటీ పడ్డాయి. చివరకు అత్యధిక ధరకు చేజిక్కించు కోవడం విస్తు పోయేలా చేసింది. ఒక రకంగా చెప్పాలంటే డ్రీమ్ లెవన్ కంటే 62 శాతం ఎక్కువ కావడం విశేషం. ఇప్పటికే బీసీసీఐకి భారీ ఎత్తున ఆదాయం సమకూరుతోంది.
Apollo Tyres New Innovation
అపోలో టైర్స్ 579 కోట్ల రూపాయల విలువైన మూడేళ్ల ఒప్పందంపై సంతకం చేసింది. ఇదిలా ఉండగా భారత క్రికెట్ జట్టు కొత్త జెర్సీ స్పాన్సర్‌గా అపోలో టైర్స్ అవతరించనుందని బీసీసీఐ సీనియర్ అధికారి మంగళవారం కి తెలిపారు. ఆన్‌లైన్ గేమింగ్ ప్రమోషన్, నియంత్రణ బిల్లు అమలులోకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ డ్రీమ్11తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత యూఏఈలో జరుగుతున్న పురుషుల ఆసియా కప్‌లో భారత జట్టుకు ప్రస్తుతం స్పాన్సర్ లేదు. బిడ్డింగ్ సెప్టెంబర్ 16న జరిగింది. అపోలో టైర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. మేము దానిని త్వరలో ప్రకటిస్తామని పేర్కొన్నారు. గతంలో డ్రీమ్ 11 రూ. 358 కోట్ల ఒప్పందం కంటే ఎక్కువ కావడం విశేషం.
Also Read : Pakistan Sensational : ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ తప్పుకుంటుందా..?



















