అమరావతి : జిల్లా కలెక్టర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. జాతీయ స్తాయిలో అవార్డు రావడం వెనుక మీ అందరి కృషి ఉందన్నారు. సంక్షేమ పథకాలు కింది స్థాయి వరకు చేరాలని ఆదేశించారు. ఇక ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథాకల గురించి , కేటాయించిన నిధుల గురించి వివరాలు వెల్లడించారు. రూ.861 కోట్లతో 20,060 కి.మీ పాత్ హోల్ ఫ్రీ రోడ్లు- రూ.2500 కోట్లతో రహదారుల నిర్మాణం, విజయవాడ – మచిలీపట్నం 6 లైన్ రోడ్డుకు ఆమోదం తెలిపామన్నారు. మూలపేట – వైజాగ్ – కాకినాడ బీచ్ రోడ్, నాగ్పూర్ – అమరావతి హైవే నిర్మాణం , హైదరాబాద్ – అమరావతి – చెన్నై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు పచ్చజెండా, రికార్డు స్థాయిలో బెంగుళూరు – అమరావతి హైవే పనులు చేపట్టడం జరిగిందన్నారు సీఎం.
గాడిలో పంచాయతీరాజ్ వ్యవస్థ. పల్లె పండుగ ద్వారా గ్రామాల్లో 4,000 కి.మీ. రోడ్ల నిర్మాణం, అడవితల్లి బాటతో గిరిజన తండాలకు రోడ్ల నిర్మాణం, శివారు గ్రామాలకు 4జీ నెట్వర్క్, కొత్తగా 28 పాలసీలు, పరిశ్రమలకు రాయితీలకు దేశంలో తొలి సారి ఎస్క్రో ఖాతాలు, దేశంలో వచ్చిన పెట్టుబడుల్లో 25.3 శాతం ఏపీకి – బిజినెస్ రిఫార్మర్ అవార్డు, సీఐఐ సమ్మిట్ 538 ఒప్పందాలు. రూ.11.38 లక్షల కోట్ల పెట్టుబడులు, 13.95 లక్షల ఉద్యోగాలు, 17 ఎస్ఐపీబీ సమావేశాల్లో రూ.11,37,222 పెట్టుబడులు, 10,01,147 లక్షల ఉద్యోగాలు రానున్నాయని ప్రకటించారు నారా చంద్రబాబు నాయుడు.


















