ప్ర‌గ‌తి దారుల్లో ఏపీ ప‌ల్లె సీమలు

మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌

hellotelugu-APPanchatraj

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌ను స్వీక‌రించిన త‌ర్వాత కీల‌క మార్పులు తీసుకు వ‌చ్చారు. మ‌హాత్ముడి క‌న్న క‌ల‌ల‌ను నిజం చేస్తున్నారు. స్తబ్దతతో కూడిన పాలనా వ్యవస్థలో ఉత్సాహాన్ని నింపేందుకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతుల ప్రక్రియను చేపట్టారు. సుమారు 10 వేల మందికి పైగా ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. అత్యంత పారదర్శకతతో చేపట్టిన ఆ ఘట్టం రాష్ట్ర పంచాయతీరాజ్ చరిత్రలో మరపురాని ఘట్టంగా మన్ననలు అందుకుంది. ఈ పదోన్నతులు పొందిన వారిలో పీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, ఎంపీడీఓలు, డీడీఓలు, జెడ్పీ సీఈవోలు ఉన్నారు. దీని ద్వారా ఉద్యోగస్తులు నిర్లిప్తత వీడి సమర్థవంతంగా విధులు నిర్వహించేలా చేశారు.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ శిఖర గ్రామాలకు బాటలు వేసిన “అడవి తల్లి బాట”, పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్ల పండుగ జరిగింది. రూ. 3,853 కోట్లు వెచ్చించి 6,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 1,331 కిలోమీటర్ల బీటీ రోడ్లు నిర్మించారు. రూ. 1,005 కోట్లు వెచ్చించి 625 గిరిజన ఆవాసాలను కలుపుతూ 1,049 కిలోమీటర్ల రహదారులు నిర్మిస్తున్నారు. రోడ్లు రావడంతో గ్రామీణ ప్రాంతాల్లో రాకపోకలు సులభతరంగా మారాయి. ఎన్నో గిరిజన గ్రామాలు డోలీ రహితంగా మారాయి. గ్రామీణ పారిశుధ్య నిర్వహణలో మ్యాజిక్ డ్రెయిన్స్, స్వచ్ఛ రథాల ద్వారా విప్లవాత్మక అడుగులు వేశారు. ఈ రెండు వినూత్న కార్యక్రమాలు గ్రామాల్లో పారిశుధ్యాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లాయి. మురుగును మాయం చేసి, భూగర్భ జలాలను పెంపొందించే మ్యాజిక్ డ్రెయిన్ల ద్వారా సాధారణ సిమెంటు డ్రెయిన్లతో పోలిస్తే సుమారు 80 శాతం ఖర్చు ఆదా అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తున్న 625 స్వచ్ఛ రథాలు పొడి చెత్త సేకరణ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిచడంతో పాటు ఆదాయాన్ని అందిస్తోంది.

Exit mobile version