Pawan Kalyan Important Comments : ప్లాస్టిక్ రహితంగా ఏపీ మారాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

ఏపీ శాస‌న స‌భ‌లో డిప్యూటీ సీఎం కీల‌క కామెంట్స్

Hello Telugu - Pawan Kalyan Important Comments

Hello Telugu - Pawan Kalyan Important Comments

Pawan Kalyan : అమ‌రావ‌తి : ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడు కోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపై ఉంద‌న్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిద‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్. శుక్ర‌వారం శాస‌న స‌భ‌లో స‌భ్యులు అడిగిన ప్రశ్న‌ల‌కు ఆయ‌న సమాధానం ఇచ్చారు. రాబోయే రోజుల‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ (AP) రాష్ట్రాన్ని ప్లాస్టిక్ ర‌హిత ప్రాంతంగా తీర్చిదిద్దాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని చెప్పారు. ఆ దిశ‌గా అడుగులు వేయ‌డం జ‌రుగుతోంద‌న్నారు. ఇందుకు ప్ర‌తి ఒక్క‌రు త‌మ వంతు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరారు. ప్ర‌జ‌లు కూడా భాగం పంచుకుంటేనే అనుకున్న స్కీం అమ‌లు అవుతుంద‌న్నారు. ఇది నాది మీది అనేది కాకుండా ప్ర‌తి ఒక్క‌రికి మేలు జ‌రుగుతుంద‌ని భావించాల‌ని సూచించారు. ఎక్క‌డా ప్లాస్టిక్ వినియోగం అన్న‌ది లేకుండా చేయాల‌న్నారు.

Pawan Kalyan Comments

ప్లాస్టిక్‌ రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌ (Pawan Kalyan). ప్లాస్టిక్‌ భూమిలో కలవడానికి చాలా ఏళ్లు పడుతుందన్నారు. ప్లాస్టిక్‌ పూర్తిగా భూమిలో కలిసి పోవడం లేద‌ని, దీని కార‌ణంగా చాలా మంది తీవ్ర అనారోగ్యాల‌కు గుర‌వుతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి అలానే ఉండి పోతుందన్నారు. ఆవుల కడుపులో సుమారు 70 కిలోల ప్లాస్టిక్‌ తొలగించిన ఘటనలు నమోదయ్యాయని గుర్తు చేశారు డిప్యూటీ సీఎం. వీటన్నింటికి సంబంధించి 2, 3 నెలల్లో కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు తిరుమలలో చాలా ప్రయత్నం చేస్తున్నారని ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పారు.

రోజువారీ జీవితంలో అవసరమై పోయిన ప్లాస్టిక్ స్థానంలో ప్రత్యామ్నాయంగా పర్యావరణ హితమైన క్లాత్, వెదురు, జ్యూట్ వంటి ఉత్పత్తుల దిశగా ప్రజలు ఆలోచించాలన్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వలన వాతావరణ కాలుష్యంతో పాటుగా, ప్రమాదకరమైన రోగాలకు దారి తీస్తుందని, పుట్టే పిల్లల్లో కూడా ప్లాస్టిక్ వ్యర్థాల చేరుతున్న ప్రమాద స్థితిని ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుని ప్లాస్టిక్ నియంత్రణకు బాధ్యత తీసుకోవాలన్నారు.

Also Read : YS Sharmila Fired on AP Govt : ఉల్లి రైతుల‌ను నిండా మంచిన స‌ర్కార్

Exit mobile version