వైఎస్ జ‌గ‌న్ రెడ్డికి మ‌తి త‌ప్పింది : స‌విత

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన బీసీ శాఖ మంత్రి

hellotelugu-MinisterSavitha

కడప జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్నారు. త‌న‌కు మ‌తి త‌ప్పింద‌న్నారు. పిచ్చాసుత్రిలో చేర్పించాల‌న్నారు. గత ప్రభుత్వంలోని అక్రమాలకు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నామని, అక్రమార్కులెవరినీ వదలే ప్రసక్తే లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. లండన్ మందులు వాడినా జగన్ మానసిక పరిస్థితి బాగా లేదని, రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వ ప్రథమ కర్త్యమని, పంట నష్ట పరిహారాన్ని సకాలంలో అందించి అండగా నిలిచిందని తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరప్పనాయునిపల్లెలో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ తో కలిసి ఉల్లి రైతులకు నష్ట పరిహారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు., రైతు సంక్షేమం లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని చెప్పారు మంత్రి ఎస్ . స‌విత‌. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో రైతుల ఇబ్బందుల పాలైనప్పుడు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది ఉల్లి రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున రూ.128.33 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కడప జిల్లా ఉల్లి రైతులకు రూ.28.40 కోట్లకు పైగా కోట్ల పరిహారం అందజేశామన్నారు. కమలాపురం నియోజకవర్గ రైతులకు రూ.11.32 కోట్లు, మైదుకూరు రైతులకు రూ.7.73 కోట్లు, పులివెందుల రైతులకు రూ.6.16 కోట్లు, జమ్మలమడుగు రైతులకు రూ.2.99 కోట్లు అందజేశామన్నారు.

Exit mobile version