Nara Lokesh : అమరావతి : రాష్ట్ర వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆధ్వర్యంలో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలతో ముఖాముఖి చేపట్టారు. ఈ సందర్బంగా వారు విన్నవించిన సమస్యలను విన్నారు. ఆపై వారు అందజేసిన వినతిపత్రాలను స్వీకరించారు. ఆయా సమస్యలకు సంబంధించిన వివిధ శాఖల అధికారులకు వాటిని పంపించారు. సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు నారా లోకేష్. ఇదిలా ఉండగా ఎన్నికల సందర్బంగా ప్రజా దర్బార్ చేపడతామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజా దర్బార్ చేపట్టాలని ఆయన సూచించారు.
AP IT Minister Nara Lokesh Praja Darbar Updates
పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు వారంలో ఒక రోజు ప్రజాదర్బార్ ను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజల గోడు వింటున్నారు. ఇదిలా ఉండగా ఇవాళ మంత్రి నారా లోకేష్ నిర్వహించిన ప్రజా దర్బార్ 75వ రోజుకు చేరింది. ఇదిలా ఉండగా మంత్రి లోకేష్ ను కలిసి స్వయంగా సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించి, వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. సమస్యలు త్వరితగతిన పరిష్కారానికి కృషి చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
Also Read : Telangana Jagruti Fired on Niranjan Reddy : నిరంజన్ రెడ్డి కామెంట్స్ తెలంగాణ జాగృతి ఫైర్
















