AP Govt Important Update : కొల్లేరు సరస్సు అభివృద్ధి కోసం అథారిటీ ఏర్పాటు

ఉత్త‌ర్వులు జారీ చేసిన ఏపీ కూట‌మి స‌ర్కార్

Hello Telugu - AP Govt Important Update

Hello Telugu - AP Govt Important Update

AP Govt : అమ‌రావ‌తి : ఏపీ కూట‌మి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొల్లేరు స‌ర‌స్సుపై ఫోక‌స్ పెట్టింది. ఈ మేర‌కు కొల్లేరు వన్యప్రాణి సంరక్షణా ప్రాంతం, రామ్సార్ స్థలంగా గుర్తింపు పొందిన సరస్సును సుస్థిరంగా అభివృద్ధి చేయడంతో పాటు జీవ వైవిధ్యాన్ని కాపాడడం కోసం ప్ర‌త్యేకంగా అథారిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్ర‌క‌టించింది. మంగ‌ళ‌వారం సీఎం ఆదేశాల మేర‌కు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఉత్తర్వులు జారీచేసింది. అథారిటీకి ముఖ్య బాధ్య‌త‌లు కూడా స్ప‌ష్టం చేసింది. ఇందులో భాగంగా కొల్లేరు సరస్సు పరిరక్షణ, అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించడం, పర్యావరణ కాలుష్యం నియంత్రణ, నీటి నాణ్యత మెరుగుదలపై ఫోక‌స్ పెట్టాల్సి ఉంటుంది.

AP Govt Key Update

చేపల వైవిధ్యం రక్షణ, సుస్థిర మత్స్యాభివృద్దితో పాటు పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానిక ప్రజలకు ఆదాయ అవకాశాలు క‌ల్పించ‌డం, జీవ వైవిధ్యం సంరక్షణ, ఆక్రమించే జాతుల, సిల్టేషన్‌ నియంత్రణ, నీటి ప్రవాహ వ్యవస్థ పునరుద్ధరణ చేప‌ట్టాలి. ప్రతి మూడు నెలలకోసారి సమావేశం జరిపి పురోగతి సమీక్ష చేప‌ట్టాల‌ని పేర్కొంది. అథారిటీలో అధ్య‌క్షుడిగా ఏపీ ప్ర‌భుత్వ (AP Govt) ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఉపాధ్యక్షుడిగా పర్యావరణ, అరణ్య, విజ్ఞాన ,సాంకేతిక శాఖ ప్రధాన కార్యదర్శి, స‌భ్యులుగా రెవెన్యూ, ఫిషరీస్, వ్యవసాయం, పంచాయతీ రాజ్, వాటర్ రిసోర్సెస్, టూరిజం, పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి, ఏలూరు, భీమ‌వ‌రం, మ‌చిలీప‌ట్నం జిల్లాల క‌లెక్ట‌ర్లు ఉంటార‌ని వెల్ల‌డించింది.

Also Read : Hero Rishab Shetty : రిష‌బ్ శెట్టికి క‌ర్నాట‌క చ‌ల‌న‌చిత్ర అవార్డు

Exit mobile version