AP Govt Interesting Support : శ్రీ‌చ‌ర‌ణికి ఏపీ స‌ర్కార్ రూ. 2.5 కోట్ల న‌జ‌రానా

1000 గ‌జాల స్థ‌లం , గ్రూప్ -1 ఉద్యోగం

Hello Telugu - AP Govt Interesting Support

Hello Telugu - AP Govt Interesting Support

AP Govt : అమ‌రావ‌తి : ఏపీ స‌ర్కార్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించారు. ముంబై వేదిక‌గా జ‌రిగిన ఐసీసీ మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ 2025ను కైవ‌సం చేసుకుంది భార‌త మ‌హిళా క్రికెట్ జ‌ట్టు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాకు చెందిన శ్రీ‌చ‌రణి అద్భుత‌మైన ప్ర‌తిభా పాట‌వాల‌ను ప్ర‌ద‌ర్శించింది. ఇండియా గెలుపొంద‌డంలో త‌ను కూడా భూమిక పోషించింది. ఈ సంద‌ర్బంగా శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి క్యాంపు కార్యాల‌యంలో ఉమెన్ క్రికెట‌ర్ శ్రీ‌చ‌ర‌ణితో క‌లిసి భార‌త మ‌హిళా జ‌ట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ మ‌ర్యాద పూర్వ‌కంగా సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో పాటు విద్యా , ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ల‌ను క‌లిశారు.

AP Govt Supports Women Cricketer Sri Charani

భేటీ అనంత‌రం ప్ర‌త్యేకంగా శ్రీ చ‌ర‌ణిని అభినందించారు. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 2025 ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్‌లో శ్రీ చరణికి గుర్తింపుగా సీఎం నేతృత్వంలోని ఏపీ స‌ర్కార్ (AP Govt) రూ. 2.5 కోట్ల న‌గ‌దు బ‌హుమ‌తి ప్ర‌క‌టించారు . అంతే కాకుండా 1,000 చ‌ద‌ర‌పు గ‌జాల ఇంటి స్థ‌లాన్ని కేటాయించారు. అంతే కాకుండా శ్రీ చ‌ర‌ణికి గ్రూప్ -1 ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని కూడా ఇస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదే స‌మ‌యంలో రాష్ట్రంలో క్రీడా రంగానికి, క్రికెట్ కు పెద్ద ఎత్తున స‌హాయ స‌హ‌కారాలు అంద‌జేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్బంగా తొలిసారిగా ఉమెన్ జ‌ట్టు వ‌ర‌ల్డ్ క‌ప్ ను కైవ‌సం చేసుకోవ‌డంతో యావ‌త్ భార‌తావ‌నికి ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వ‌చ్చారంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

Also Read : MP Gurumurthy Strong Demand : తిరుపతిలో నూతన నవోదయ విద్యాలయం ఏర్పాటు

Exit mobile version