‘ర‌ణ‌బాలి’ థియేట్రికల్ ట్రైలర్ డేట్ ఫిక్స్

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా కీ రోల్

hellotelugu-Ranabaali

హైద‌రాబాద్ : ఎంత‌గానో ఆస‌క్తితో చూస్తున్న చిత్రం రణ‌బాలి. ఇందులో ముఖ్య పాత్ర‌లు పోషించారు ఇటీవ‌లే ఒక్క‌టైన‌, పెళ్లి చేసుకున్న అద్భుత‌మైన జంట విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న లీన‌మై న‌టించారు. ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు రాహుల్ సాంకృత్య‌న్. విజయ్ దేవరకొండ నటించిన రాబోయే పీరియడ్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కింది. మొత్తంగా ‘రణబాలి’ సినీ ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే పాన్ ఇండియా హీరోయ‌న్ గా, నేష‌న‌ల్ క్ర‌ష్ గా కోట్లాది యువ హృద‌యాల‌ను కొల్ల‌గొట్టింది త‌న న‌ట‌న‌తో, డ్యాన్సుల‌తో ర‌ష్మిక మంద‌న్నా. ఈ సినిమా , దాని కథాంశాన్ని పరిచయం చేసేందుకు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మ‌రం చేస్తోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న తాజా ప్రచారం ప్రకారం ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ అక్టోబర్ 8న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ట్రైలర్ విడుదల తేదీపై చిత్ర బృందం ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

19వ శతాబ్దపు భారతీయ నేపథ్యంలో సాగే ‘రణబాలి’ చిత్రం బ్రిటిష్ పాలనలో ఏర్పడిన ఆహార సంక్షోభం సమయంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందుల చుట్టూ తిరుగుతుంది. ఇందులో విజయ్ దేవరకొండ ‘సింగనమల బొబ్బిలి రణబాలి’ అనే తిరుగుబాటు నాయకుడి పాత్రలో కనిపించ‌నున్నారు. ఈ పాత్ర బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఈ ర‌ణ‌బాలి మూవీని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భారీ ఖ‌ర్చుతో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, టి-సిరీస్ దీనిని సమర్పిస్తోంది. అజయ్-అతుల్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ‘రణబాలి’ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 16న థియేటర్లలో విడుదల కానుంది ప్ర‌పంచ వ్యాప్తంగా.

Exit mobile version