ప్ర‌జారోగ్యానికి ఏపీ స‌ర్కార్ పెద్ద‌పీట

మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ కామెంట్

hellotelugu-satyakumaryadav

అమ‌రావ‌తి : ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్రం తాజాగా తీసుకు వ‌చ్చిన జీఎస్టీ సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌న్నారు. ఈ సంద‌ర్బంగా దాదాపు రూ.1000 కోట్లు ప్ర‌జా ఆరోగ్యానికి సంబంధించి ఆదా అవుతుంద‌ని చెప్పారు. ప్ర‌ధానంగా నిత్యం ఉప‌యోగించే మందుల ధ‌ర‌లు పెద్ద ఎత్తున త‌గ్గ‌నున్నాయ‌ని పేర్కొన్నారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ద‌స‌రా పండుగ శుభాకాంక్ష‌లు తెలిపారు. త‌మ ప్ర‌భుత్వం వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధుల‌ను కేటాయించ‌డం జ‌రిగింద‌న్నారు. నిన్న‌టి వ‌ర‌కు వాడే మందుల‌లో కొన్ని స‌గానికి పైగా, మ‌రికొన్ని 80 శాతానికి పైగా అందుబాటులోకి రానున్న‌ట్లు తెలిపారు స‌త్య కుమార్ యాద‌వ్. మందులు, వాటి ధ‌ర‌ల‌కు సంబంధించి జీఎస్టీ ఎలా అమ‌లు అవుతుంద‌నే దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

సదరు సంస్థలు ఖరారు చేసే ఎంఆర్పీల్లోనే జీఎస్టీ ఇమిడి ఉందన్నారు. తాజాగా 12% జీఎస్టీని 5%కు తగ్గించినందున ఎంఆర్పీ ధర 6% నుంచి 7% వరకు తగ్గిందన్నారు మంత్రి. ఈ కేటగిరిలోనే 99% మందులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ యాద‌వ్ పేర్కొన్నారు . ఇక ఔషధ నియంత్రణ పరిపాలనా విభాగం పేర్కొన్న ప్రకారం ధ‌ర‌ల వివ‌రాలు వెల్ల‌డించారు. పారాసిటమాల్ ఒక షీట్ ధర 12% జీఎస్టీతో కలిపి రూ.28గా ఉండ‌గా ఇప్పుడు రూ. 26.04కు వ‌స్తుంద‌న్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉపయోగించే మెటఫార్మిన్ 500 ఎంజీ (గైసిఫేజ్) రూ.41.65 నుంచి రూ.38.73 (-రూ.2.92 పైసలు), రక్తపోటు అదుపునకు ఉపయోగించే టెల్మిసార్టన్ -40 ఎంజీ రూ.113.7 నుంచి రూ.105.74 (-రూ.7.96 పైసలు) కు తగ్గిందన్నారు స‌త్య కుమార్ యాద‌వ్. అగ్యుమెంటిన్ 625 ఎంజీ (యాంటీబయాటిక్) రూ.204.86 నుంచి రూ.190.51 (-రూ.14.35)కు, మధుమేహ వ్యాధిగ్రస్తులు వినియోగించే హ్యూమన్ ఇన్సులిన్ ధర రూ.454 నుంచి రూ.422.02(-రూ.31.08)కు ల‌భిస్తుంద‌ని తెలిపారు మంత్రి.

పాంటాప్-40 లాంటి గ్యాస్ట్రిక్ ట్యాబెలెటు షీటు ధర రూ.170 నుంచి రూ.158.10 త‌గ్గింద‌ని, 33 రకాల మందులపై 12% పన్ను పూర్తిగా తొలగించార‌ని తెలిపారు. క్యాన్సర్, ఇతర అరుదైన మందుల ధరలపై జీఎస్టీని తీసి వేశార‌ని పేర్కొన్నారు. దీని ప్రకారం ఫెజిలాటెడ్ లైపోజోమాల్ (ఓనీవైడ్) ఇంజక్షన్ (వయల్) ధర రూ.4,80,000గా ఉంద‌ని, కొత్త ధర రూ.4,28,570 దీనివల్ల బాధితుడికి రూ.51,430 ఆదా అయిందన్నారు. ఇమిగ్లిసిరేజ్ (సెరిజైమ్) ఇంజక్షన్ (వయల్) పై ఉన్న 5% జీఎస్టీని తొలగించినందున రూ.3,70,000 నుంచి రూ.3,52,381కు అందుబాటులోకి వచ్చిందన్నారు స‌త్య కుమార్ యాద‌వ్.

Exit mobile version