మ‌త్స్య‌కారుల‌కు ఏపీ స‌ర్కార్ భ‌రోసా : అనిత వంగ‌ల‌పూడి

ఇప్ప‌టికే భారీ ఎత్తున నిధులు జ‌మ చేశామ‌న్న మంత్రి

hellotelugu-AnithaVangalapudi

అన‌కాప‌ల్లి జిల్లా : ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మ‌త్స్య‌కారుల గురించి. గురువారం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం మంత్రి నివాసం వద్ద మత్స్యకారుల సేవలో కార్యక్రమం నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజ‌రై ప్ర‌సంగించారు. పాయకరావుపేట, నక్కపల్లి, యస్ రాయవరం మండలాల మత్స్యకారులు పాల్గొన్నారు పెద్ద ఎత్తున‌. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు ఈ సంద‌ర్బంగా వేట నిషేధ భృతి చెక్కును లబ్ధిదారులకు అందజేశారు హోం మంత్రి అనిత. NDA కూటమి మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంటుందని స్ప‌ష్టం చేశారు. గ‌త ప్ర‌భుత్వం గంగ‌పుత్రుల‌ను ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. కానీ కూట‌మి స‌ర్కార్ కొలువు తీరాక సీన్ మారింద‌న్నారు.

పాయకరావుపేట నియోజకవర్గంలో 18 మత్స్యకార గ్రామాలు ఉన్నాయ‌ని చెప్పారు అనిత వంగ‌ల‌పూడి. క్లిక్ చేసిన గంటలోపే మత్స్యకార అకౌంట్లో డబ్బులు పడ్డాయని చెప్పారు.సీఎం చంద్రబాబు మత్స్యకారులతో కలిసి భోజనం చేశారని తెలిపారు. మత్స్యకారులతో మమేకమయ్యారని పేర్కొన్నారు. మత్స్యకారుల జీవన విధానాన్ని మార్చడానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు వంగ‌ల‌పూడి అనిత‌. పాయకరావుపేట నియోజకవర్గానికి రెండు ఫిష్ లాండింగ్ సెంటర్ లు ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉంద‌న్నారు. 2014 నుండి 2019 లో మత్స్యకార గ్రామాల్లో అభివృద్ధి పనులు జరిగాయ‌ని చెప్పారు. మరల ఇప్పుడు NDA ప్రభుత్వంలో మత్స్యకార గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దీనికి కార‌ణం చంద్ర‌బాబేన‌ని పేర్కొన్నారు. .

Exit mobile version