అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు వచ్చే ఏడాది 2026లో గోదావరి పుష్కరాలు ప్రారంభం కానున్నాయని తెలిపింది. ఇందులో భాగంగా జూన్ 26 నుంచి కొనసాగుతాయని వెల్లడించారు .రెవెన్యూ (ఎండోమెంట్స్- II) శాఖ మాజీ అధికారిక కార్యదర్శి ఎం హరి జవహర్‌లాల్ . ఈ సందర్శంగగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల సమయంపై ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానాలు (టిటిడి) ఆస్థాన సిద్ధాంతి టి వెంకట కృష్ణ పూర్ణ ప్రసాద్ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లు చెప్పారు. గోదావరి నదికి పుష్కరాలు రానున్నాయని తెలిపారు.
జూన్ 26, 2027 నుండి ప్రారంభమై 12 రోజులు అంటే జూలై 7, 2027 వరకు కొనసాగుతాయని ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. మెగా తీర్థయాత్ర తేదీలను నిర్ణయించడానికి ఎండోమెంట్స్ కమిషనర్ టీటీడీ పూజారిని సంప్రదించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మతపరమైన కార్యక్రమంపై నోటిఫికేషన్ కూడా జారీ చేసిందన్నారు. గతంలో కూడా గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించం జరిగిందన్నారు ఎం. హరి జవహరి లాల్.
ఇదిలా ఉండగా గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రాబు నాయుడు. ఇప్పటికే ఏపీని పర్యాటక, సాంస్కృతిక రంగాలకు కేరాఫ్ గా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు సూచించారు.
