AP CS Vijayanand : అమరావతి – ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 5,842 ఎకరాలలో సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు స్పస్టం చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ (AP CS Vijayanand). అంతే కాకుండా 2.93 లక్షల వ్యవసాయ పంపు సెట్లను సోలరైజ్ కానుందన్నారు. 1,162.8 మెగా వాట్స్ సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవాలని ఏపీ డిస్కమ్ లను ఆదేశించారు. ఈ పథకం అమలును వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ ట్రాన్స్ కో జేఎండీ కీర్తి చేకూరి, డిస్కంల సీఎండీలు పృథ్వీ రాజ్ , పి. పుల్లారెడ్డి, కె. సంతోష్ రావు, ఏపీ ట్రాన్స్ కో డైరెక్టర్ ఏకేవీ భాస్కర్ , ఎన్ఆర్ఈడీసీఏపీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. కమలాకర్ బాబు, ప్లాంట్ల డెవలపర్లతో పాటు అధికారులతో సమీక్షించారు.
AP CS Vijayanand Key Comments Solar Plant
ముఖ్యమంత్రి నాయుడు సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం పెండింగ్‌లో ఉన్న 1,700 ఎకరాల భూమిని ఎన్ఆర్ఈడీసీఏపీకి అప్పగించడాన్ని వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని ప్రధాన కార్యదర్శి డిస్కంలను ఆదేశించారు. ప్రాజెక్ట్ అమలు ఆలస్యం లేకుండా కొనసాగేలా ఎంపిక చేసిన డెవలపర్లతో విద్యుత్ కొనుగోలు, భూమి లీజు ఒప్పందాలు కుదుర్చుకోవాలని స్పష్టం చేశారు.
12 నెలల్లోపు ప్రాజెక్టులను పూర్తి చేయాలని అన్నారు విజయానంద్. వ్యవసాయ ఫీడర్ల సౌరీకరణ ప్రభుత్వంపై సబ్సిడీ భారాన్ని తగ్గిస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక ఇంధన వినియోగాన్ని ప్రోత్సహిస్తుందని CS నొక్కి చెప్పారు.
Also Read : S Jaishankar Fired on America : పాకిస్తాన్ కు మద్దతు ఇస్తున్నది ఎవరో తెలుసు
















