AP CS Important Review : రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని ఏపీ ప‌ర్య‌ట‌న‌పై సీఎస్ స‌మీక్ష

విస్తృతంగా ఏర్పాట్లు చేయాల‌ని విజ‌యానంద్ ఆదేశం

Hello Telugu - AP CS Important Review

Hello Telugu - AP CS Important Review

AP CS : అమ‌రావ‌తి : ఏపీలో ఈనెలాఖ‌రులో భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో (PM Modi) పాటు ఉప రాష్ట్ర‌ప‌తి రాధాకృష్ణ‌న్ ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌యానంద్ స‌చివాల‌యంలో స‌మీక్ష చేప‌ట్టారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై ఆరా తీశారు. నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము నవంబర్ 20న తిరుపతిలో, నవంబర్ 22న పుట్టపర్తిలో పర్యటించ‌నున్నారు, ఉప రాష్ట్రపతి రాధాకృష్ణ‌న్ నవంబర్ 14న శుక్ర‌వారం విశాఖపట్నంలో పర్యటిస్తారు. ఇక్క‌డ ప్రారంభ‌మ‌య్యే ఏపీ సీఐఐ స‌మ్మిట్ కు ముఖ్య అతిథిగా హాజ‌రు కానున్నారు. ఇప్ప‌టికే ఏర్పాట్లు చేసింది స‌ర్కార్.

AP CS Review on CM and PM Visit

మ‌రో వైపు న‌వంబ‌ర్ 19న ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ పుట్టపర్తిని సందర్శించనున్నారు. ఇదిలా ఉండ‌గా హై ప్రొఫైల్ సందర్శనలకు ఫూల్‌ప్రూఫ్ ఏర్పాట్లను నిర్ధారించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. అన్ని విభాగాలను దగ్గరగా సమన్వయం చేసుకోవాలని, లోపాలకు అవకాశం లేకుండా చూడాలని స్ప‌ష్టం చేశారు. లాజిస్టికల్, సెక్యూరిటీ, ప్రోటోకాల్ చర్యలను జాగ్రత్తగా ప్రణాళిక చేసి అమలు చేయాలని నొక్కి చెప్పారు. సమీక్షా సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల‌ల శాఖ‌, సందర్శనల కోసం రాష్ట్ర నోడల్ అధికారి ఎంటీ కృష్ణబాబు, ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా, లా అండ్ ఆర్డ‌ర్ అద‌న‌పు డీజీపీ మ‌ధుసూద‌న్ రెడ్డి ఈ స‌మీక్షా స‌మావేశంలో పాల్గొన్నారు. తిరుపతి, శ్రీ సత్యసాయి జిల్లాల కలెక్టర్లు, బహుళ విభాగాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు వర్చువల్‌గా హాజ‌ర‌య్యారు.

Also Read : Nara Lokesh – AP Gets Huge Investments : ఏపీలో రూ. 82,000 కోట్ల భారీ పెట్టుబ‌డి

Exit mobile version