అమరావతి : నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ కు పండగ లాంటి వార్త చెప్పింది ఏపీ సర్కార్. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజాగా రూపొందించిన సీక్వెల్ మూవీ అఖండ-2 మూవీకి సంబంధించి టికెట్ల రేట్లు పెంచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వ పరంగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీంతో ఇష్టానుసారం పెంచుకునే సౌలభ్యం నిర్మాతలకు కలుగుతుంది. పెట్టిన పెట్టుబడి వారం రోజుల్లోనే రావాలనే ఆలోచనతో ఇలా చేస్తున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ రేట్ల పెంపు డిసెంబర్ 5 నుండి 10 రోజుల పాటు కొనసాగుతుంది, ఈ సినిమా పెరిగిన టిక్కెట్ రేట్లను పొందుతుంది.
సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ. 75 , మల్టీప్లెక్స్‌లలో రూ. 100 పెరగనుంది.
ఇదిలా ఉండగా బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ సినిమా 2021 బ్లాక్‌బస్టర్ అఖండకు సీక్వెల్. భారతదేశం అంతటా పెయిడ్ ప్రీమియర్లు నిర్వహించనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. సినిమా ప్రారంభోత్సవానికి పెద్ద బూస్ట్‌గా ఏపీ సర్కార్ బాలయ్య మూవీకి ప్రత్యేక వెసులుబాటు ఇచ్చింది. ఈ చిత్రానికి గణనీయమైన టికెట్ ధర పెంపును ఆమోదించింది. కొత్త ఆర్డర్‌ల ప్రకారం, అన్ని కేంద్రాలలో రాత్రి 8 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ప్రీమియర్ షోలు రూ. 600 గా ఉంటాయి. సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలు దాదాపు రూ. 222.50 ఉంటాయి, మల్టీప్లెక్స్లు విడుదలైన మొదటి పది రోజుల్లో రూ. 277 వసూలు చేస్తాయి. ఈ చిత్రంలో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో నటించారు బాలయ్యతో పాటుగా.



















